తెలుగు

ధ్యానం 71: మన అల్పత్వం, శూన్యత

ఆండ్రే మిరోనోవ్, CC BY-SA 4.0, వికీమీడియా కామన్స్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

మనం ఉన్నదున్నట్లుగా మనల్ని మనం చూసుకోగలగడం దేవుని కృప.  మరి మనల్ని మనం ఇలా చూసుకుంటే ఏమి కనిపిస్తుంది?  మన దయనీయ స్థితి, శూన్యత కనిపిస్తాయి.  మొదట్లో ఇది అంత కోరదగినదిగా అనిపించకపోవచ్చు.  క్రీస్తులో మనకున్న గౌరవానికి ఇది విరుద్ధంగా కూడా అనిపించవచ్చు.  కానీ కీలకమైన విషయం అదే.  మన గౌరవం “క్రీస్తులో” ఉంది.  ఆయన లేకుండా మనం శూన్యం.  మనంతట మనం దయనీయ స్థితిలోనూ శూన్యతలోనూ ఉన్నాం (చూడండి దినచర్య #256).

ఈ రోజు, మీ “శూన్యతను” అంగీకరించడానికి నొచ్చుకోకండి, భయపడకండి.  మొదట్లో ఇది మీకు అంగీకారయోగ్యంగా అనిపించకపోతే, దేవుడు లేకుండా మీరెలా ఉన్నారో అలా మిమ్మల్ని మీరు చూసుకునే కృప కోసం ఆయనను వేడుకోండి.  మన దివ్య రక్షకుడు లేకుండా, మీరు నిజంగా అన్ని విధాలా దయనీయ స్థితిలో ఉన్నారని త్వరలోనే గ్రహిస్తారు.  దేవుడు మీ కోసం చేసినదంతా మరింత పూర్తిగా గ్రహించడానికి ఇది తోడ్పడుతుంది కాబట్టి, ఇదే ప్రగాఢమైన కృతజ్ఞతకు ఆరంభం.  మీరు దీనిని గ్రహించినప్పుడు, ఈ శూన్యతలో మిమ్మల్ని కలుసుకోవడానికి ఆయన వచ్చి, తన అమూల్యమైన బిడ్డగా ఉండే గౌరవానికి మిమ్మల్ని ఉన్నతపరిచారనే సత్యంలో ఆనందిస్తారు.

ప్రభువా, ఈ రోజు నా దయనీయ స్థితిని, దౌర్భాగ్యాన్ని నేను చూడగలిగేలా చేయుము.  నీవు లేకుండా నేను శూన్యమని అర్థం చేసుకునేలా చేయుము.  అలా గ్రహించినప్పుడు, కృపలో నీ ప్రియమైన బిడ్డగా మారే అమూల్యమైన వరానికి శాశ్వతంగా కృతజ్ఞత కలిగి ఉండేందుకు నాకు సహాయము చేయుము.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఇరవయ్యవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు

పునీత యోసేపునకు నవదిన ప్రార్థన. మార్చి 10-18 వరకు ప్రార్థిస్తారు.

తపస్సుకాలానికి ఉపయోగకరమైన వనరులు

తపస్సుకాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు