పునీత మార్కు సమక్షంలో బోధిస్తున్న పునీత పేతురు, చిత్రకారుడు ఫ్రా ఆంజెలికో
ఆంగ్లంలో వినండి
మీరు పవిత్రమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నారా? అలా అయితే, మీ అంతట మీరే దానిని సాధించలేరు. మీకు మరొకరి సహాయం, అంతేకాక ఎంతోమంది సహాయం అవసరం. ఇతరుల ప్రేమపూర్వకమైన మార్గదర్శకత్వాన్ని పొందేందుకు ప్రభువు మనకు ఎన్నో మార్గాలను ఇచ్చారు. క్రీస్తు మనస్సుకు, హృదయానికి అనుగుణంగా తమను నడిపించే ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఎన్నో సంవత్సరాలుగా తమకు ఉండే దీవెన కొందరికి లభిస్తుంది. అయితే చాలామంది, క్రీస్తు తన కతోలిక సభ ద్వారా అందించే సాధారణ మార్గదర్శకత్వంపై ఆధారపడటానికి పిలువబడ్డారు. క్రమం తప్పకుండా మన పాపాలను ఒప్పుకోవడానికి ఒక పాపసంకీర్తన గురువును ఎంచుకున్నప్పుడు మనం అలా చేస్తాము. పునీతుల జీవితాలను అధ్యయనం చేసి, వారి జ్ఞానం నుంచి నేర్చుకున్నప్పుడు మనం అలా చేస్తాము. మన ప్రభువు పలకదలచిన మాటలను హృదయంలో ఇముడ్చుకోవాలని కోరుకుంటూ దివ్యబలిపూజలో శ్రద్ధగా విన్నప్పుడు మనం అలా చేస్తాము. అలాగే, నిజమైన పవిత్రత గలవారు తమ వినమ్రమైన సలహాను అందించేందుకు మన ఆత్మలను తెలుసుకోవడానికి వారిని అనుమతించినప్పుడు మనం అలా చేస్తాము (చూడండి డైరీ #938).
మీ ఆత్మను నడిపించడానికి ప్రభువును మీరు ఎలా అనుమతిస్తున్నారు? పాపసంకీర్తనలో ఆయన మీతో మాట్లాడుతుంటే వింటున్నారా? దివ్యబలిపూజలోనూ, పునీతుల జ్ఞానం ద్వారానూ, కతోలిక సభ బోధనల ద్వారానూ ఆయన చెప్పేది శ్రద్ధగా వింటున్నారా? మీ ప్రయాణంలో మీకు సహాయపడటానికి దేవుడు మీ జీవితంలో ఉంచిన వ్యక్తులను మీరు సంప్రదిస్తున్నారా? మీ జీవితాన్ని పవిత్రత వైపు నడిపించడంలో సహాయపడటానికి దేవుడు ఇతరులను ఏ విధాలుగా ఉపయోగించాలనుకుంటున్నారో ఈ రోజు ధ్యానించండి. ఈ వరాన్ని ఆయన అపారమైన కారుణ్య కార్యంగా స్వీకరించండి.
ప్రభువా, నీవు, నీవు మాత్రమే నాకు నిర్దేశకుడవు, మార్గదర్శివి. అయినా ఇతరుల మధ్యవర్తిత్వం ద్వారా నన్ను నడిపించాలని నీవు ఎంచుకుంటావు. ఈ జీవిత ప్రయాణంలో నీవు నాకు అందించే ఎన్నో సహాయాలను స్వీకరించేందుకు నన్ను నేను తగ్గించుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా దయచేయి. నీ కారుణ్యానికి, కృపకు సాధనాలైన వీరిని నేను ఎన్నడూ తిరస్కరించకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
జూన్ 27 – అలెగ్జాండ్రియాకు చెందిన పునీత సిరిల్, పీఠాధిపతులు మరియు సభ పండితులు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




