తెలుగు

ధ్యానం 196: ఇతరులలో యేసును ప్రేమించడం

చిత్రం సౌజన్యం: అడోబీ స్టాక్
వీడియో – ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన అలెక్స్ ప్రోయిమోస్, CC BY 2.0, వికీమీడియా కామన్స్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

“నా సోదరులలో అత్యల్పులైనవారికి మీరు ఏది చేసినా, అది నాకే చేస్తున్నారు” (మత్తయి 25:40) అనే సువార్త వాక్యం మనకు బాగా పరిచయమే. అయితే మీరు దీనిని నమ్ముతున్నారా? నమ్మితే, యేసును ప్రేమించడం సులభమని, రోజంతా మీరు మరొకరిని కలుసుకున్న ప్రతిసారీ అలా చేయడానికి మీకు అవకాశం ఉందని తెలుసుకుంటారు. అది ఆప్యాయమైన చిరునవ్వు లేదా మాట ద్వారా కావచ్చు. ఉదారత, క్షమాపణ లేదా సేవతో కూడిన కార్యం ద్వారా కావచ్చు. అయితే మీరు మరొకరికి ప్రేమతో ఏది చేసినా, అది యేసుకే చేస్తున్నారు. ఇది సత్యం. అలాగే మనం మరొకరిపట్ల కఠినంగా లేదా కనికరం లేకుండా ప్రవర్తించినప్పుడు మన ప్రభువు హృదయాన్ని గాయపరుస్తామనేది కూడా సత్యమే. ఈ మౌలిక సత్యాన్ని మన మనస్సులలో ఒక భావనగా సులభంగా అర్థం చేసుకుంటాం; కానీ మన క్రియల ద్వారా అంత సులభంగా అర్థం చేసుకోలేం. నిజంగా మరొకరిలో యేసును చూడటం, వారికి చేసే సేవ ద్వారా మన ప్రభువును ప్రేమిస్తున్నామని నమ్మడం కష్టంగా ఉండవచ్చు. అయితే నమ్మడం కష్టంగా ఉన్నంత మాత్రాన దానిని నమ్మకుండా, దాని ప్రకారం జీవించకుండా ఉండకూడదు (చూడండి డైరీ #1029).

మీరు ప్రతిరోజూ కలుసుకునే వ్యక్తుల గురించి ఆలోచించండి. వారిని చూసినప్పుడు, వారి సాన్నిధ్యాన్ని మన ప్రభువును ప్రేమించమనే ఆహ్వానంగా చూస్తున్నారా? ఇలా చేయడం కష్టంగా ఉందా? యేసు వారిలో దాగి ఉండి, మన ప్రేమ కోసం ఎదురుచూస్తున్నారని మనం నమ్మాలి. ఈ రోజు మీరు కలుసుకునే వ్యక్తులలో దాగి, మీ కోసం ఎదురుచూస్తున్న మీ ప్రభువు గురించి ధ్యానించండి. వారి ద్వారా మన ప్రభువును ప్రేమించడానికి వెనుకాడకండి. ఎందుకంటే వారిలో దైవకారుణ్యపు ఊట తెరవబడటానికి వేచి ఉంది.

ప్రభువా, నేను ప్రతిరోజూ కలుసుకునేవారిపట్ల అపారమైన కనికరం చూపాలని నీవు కోరుకుంటున్నావు. వారిలో నిన్ను చూడటానికి, నేను కలుసుకునే ప్రతి ఒక్కరిలో నిన్ను ప్రేమించడానికి నాకు అనుగ్రహం దయచేయి. ప్రియమైన ప్రభువా, నిన్ను చూడగల కన్నులు నాకు దయచేయి. ఇతరులలో నిన్ను కనుగొన్నప్పుడు, నీవు నాకు ప్రసాదించే కనికరంతో వారిని ప్రేమిస్తూ, నా హృదయాన్ని వారికి తెరవడానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

జూలై 15 – పీఠాధిపతి, సభ పండితుడు అయిన పునీత బొనవెంచర్ సంస్మరణ

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు