తెలుగు

ధ్యానం 223: ఒక భయానకమైన రోజు

జెహాన్ కుజాన్ ది యంగర్, CC BY-SA 3.0, వికీమీడియా కామన్స్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

జీవితంలో ఏదీ భయానకంగా ఉండాల్సిన అవసరం లేదు.  మనం అనుభవించే అత్యంత తీవ్రమైన పోరాటాన్ని, బాధను కూడా దేవుడు తన కారుణ్యానికి, మన పరిశుద్ధీకరణకు మూలంగా సులభంగా మార్చగలడు.  కానీ మనకు ఎదురైతే నిజంగా భయానకంగా ఉండే విషయం ఒకటుంది.  మన మొండితనంతో, వినయంగా పశ్చాత్తాపపడి మన జీవితాలను మార్చుకోవడానికి నిరాకరిస్తూ, దేవుని కారుణ్యానికి మన హృదయాలను మూసుకొని ఉంటే, ఆ భయానకమైన విషయం తీర్పు దినమే.  ఇది తలచుకుంటేనే భయం కలిగించే వాస్తవం.  మనం దేవుని న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు, మొండిగా పాపాన్ని అంటిపెట్టుకొని ఉండటాన్ని ఎన్నటికీ సమర్థించుకోలేము.  ఎన్ని సాకులు చెప్పినా, మనల్ని మనం ఎంత సమర్థించుకున్నా దేవుని న్యాయాన్ని సంతృప్తిపరచలేము.  మీ పరిస్థితి ఇంతవరకు రానివ్వకండి.  ఇప్పుడే పశ్చాత్తాపపడండి.  నిజాయితీగా పశ్చాత్తాపపడి మీ పాపాన్ని ఒప్పుకోండి.  మీరే నీతిమంతులమనే భావనను పట్టుకొని ఉండకండి.  ఇప్పుడు, మీ తీర్పు దినం వరకు మీకు అందించబడుతున్న దేవుని అనంత కారుణ్యాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే, ఇలా చేయడం సులభమవుతుంది.  ఆ తరువాత చాలా ఆలస్యమైపోతుంది.  వేచి ఉండకండి (చూడండి దినచర్య #1160).

మీరు ఏ విషయంలో పశ్చాత్తాపపడాలి?  నిజంగా ఆలోచించండి, అదేమిటి?  మీలో పాపమేమీ లేనట్లుగా ప్రవర్తిస్తూ, మీరే నీతిమంతులమనే భావనను అంటిపెట్టుకోకండి.  మీరు ఇతరులను మోసగించవచ్చు, మిమ్మల్ని మీరు కూడా మోసగించుకోవచ్చు, కానీ దేవుణ్ణి ఎన్నటికీ మోసగించలేరు.  మీ పట్ల ఆయన ప్రేమ మీరు ఎన్నటికీ గ్రహించలేనంత గొప్పది. ఈ విషయం తెలుసుకోవడం మీ పాపాన్ని ఒప్పుకోవడం గురించిన మీ ఆందోళనలను తగ్గించాలి.  మీ పాపాన్ని ఒప్పుకోండి; మీ ముందు కారుణ్యపు వరద ద్వారాలు తెరచుకోవడం చూడండి.

ప్రభువా, నా పాపానికి విచారిస్తున్నాను, నిజంగా పశ్చాత్తాపపడుతున్నాను.  ముఖ్యంగా నా తప్పులను నిజాయితీగా ఒప్పుకోలేకపోయినందుకు ఎంతో విచారిస్తున్నాను.  నీవు నా ఆత్మను చూసే విధంగానే దానిని చూడటానికి, నా పాపాన్ని, ముఖ్యంగా నా గర్వాన్ని అంటిపెట్టుకొని నిన్ను విడిచి తొలగిపోయిన విధాలను ఒప్పుకోవడానికి ఈ రోజు నాకు అనుగ్రహాన్ని దయచేయి.  ప్రియ ప్రభువా, నాపై కరుణ చూపు.  నన్ను, నా పాపమంతటినీ నీకు అప్పగిస్తున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఆగస్టు 11 – కన్య అయిన పునీత క్లారా స్మరణ

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు