తెలుగు

ధ్యానం 250: నేలపై సాష్టాంగపడి ప్రార్థించడం

మీరు ప్రార్థించేటప్పుడు మన ప్రభువు చెంతకు ఎలా వెళ్తారు? ప్రేమపూర్వక భక్తితో మీ రోజంతటినీ ఆయనకు సమర్పించడం, రోజంతా మీ అత్యంత సన్నిహిత మిత్రునితో మాట్లాడినట్లుగా ఆయనతో మాట్లాడడం నిశ్చయంగా మంచిదే. అయితే మన ప్రార్థన గాఢంగా ఉండవలసిన, ఆ గాఢతను వ్యక్తపరచవలసిన ఇతర సమయాలూ ఉంటాయి…

ధ్యానం 248: అపరిమిత వనరులు

అతి కొద్దిపాటి ప్రాణవాయువును అపరిమితమైన శక్తిగా మార్చే యంత్రాన్ని తయారుచేసి, అపరిమిత సహజ వనరులకు ఒక మూలాన్ని మీరు కనుగొన్నారని ఊహించుకోండి. మీరు చేయవలసిందల్లా మీరు తయారుచేసిన యంత్రాన్ని ఆన్ చేయడమే; అప్పుడు శక్తి ఉత్పత్తి అవుతుంది…

ధ్యానం 247: అవసరాల్లో ఉన్నవారి ద్వారా లభించే ఆశీర్వాదం

మీ కుటుంబంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో ఉన్నా, చెరసాలలో ఉన్నా, లేదా ఏదైనా తీవ్రమైన అవసరంలో ఉన్నా, అది మీకు భారంగా ఉంటుందా లేక ఆశీర్వాదంగా ఉంటుందా?  దీని గురించి ఆలోచించండి.  ప్రత్యేక అవసరాలు ఉన్నవారు మీ జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నారా?  పూర్తిగా ఆచరణాత్మక స్థాయిలో ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తే, ఆ…

ధ్యానం 245: వాయిదా పడిన కాఠిన్యం

ఇక్కడే, ఇప్పుడే తన న్యాయాన్ని అమలు చేసే పూర్తి హక్కు యేసుకు ఉందని తెలుసుకోవడం ముఖ్యం.  మన పాపాల కారణంగా మనపట్ల కఠినంగా వ్యవహరించడానికీ, మనపై నిత్య తీర్పు విధించడానికీ ఆయనకు పూర్తి హక్కు ఉంది.  ఆయన కారుణ్యం కారణంగా మనం తరచూ ఈ సత్యాన్ని మరచిపోతుంటాము.  కానీ…

ధ్యానం 244: లోకాంతం వరకు పనిచేయడం

దేవుని కార్యాలను వ్యాపింపజేస్తూ మీరు రాత్రింబగళ్లు శ్రమిస్తే, అది మంచిదే. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన దైవకారుణ్యాన్ని వ్యాపింపజేయడానికి మీకున్న నిబద్ధత మంచి ఫలాలను ఇస్తుంది. అయితే, లోకాంతం వరకు తన కారుణ్యాన్ని వ్యాపింపజేయడానికి దేవుడు మనల్ని ఉపయోగించుకోగలడని కూడా మనం గ్రహించాలి. ఎలా? కేవలం…

ధ్యానం 242: విశిష్టంగా ప్రకాశించే నిజమైన సౌందర్యం

“సౌందర్యం” చూసే వారి దృష్టిలోనే ఉంటుందని అంటారు.  మరో మాటలో చెప్పాలంటే, సౌందర్యానికి నిర్వచనం ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుందని కొందరు అంటారు.  పైపైన చూసినప్పుడు ఇందులో కొంత నిజం ఉండవచ్చు, కానీ ఒక…

ధ్యానం 241: మీ నిర్దిష్ట పాపాలకు పరిహారం

మీరు మీ పాపాలను ఎలా జయిస్తారు? ప్రతి పాపం భిన్నమైనది; దానిపట్ల ఉన్న ఆసక్తిని విడిచిపెట్టడానికి ప్రత్యేకమైన ప్రార్థన, త్యాగం అవసరం. సాధారణంగా కనిపించే మూడు రకాల పాపాలు: శరీర సంబంధమైన పాపాలు, కోపంతో చేసే పాపాలు, గర్వంతో చేసే పాపాలు. ఈ పాపాలలో ప్రతిదానినీ జయించవచ్చు; అయితే ప్రత్యేకమైన…

ధ్యానం 240: జీవితంలో తీపా, చేదా?

మీ జీవితంలో మీరు దేనిని కోరుకుంటారు? ప్రతిరోజూ ఇంద్రియాలకు తీపిని కలిగించే అనుభవాలనా, చేదును కలిగించే అనుభవాలనా? మరో మాటలో చెప్పాలంటే, మీ దైనందిన జీవితంలోని అనేక అంశాలలో ఆనందించాలని కోరుకుంటున్నారా, లేక మీరు నెరవేర్చే దైనందిన కర్తవ్యం మీలో ఒక రకమైన చేదును మిగల్చాలని…

ధ్యానం 239: కారుణ్యపు ముద్ర

ప్రతి గొప్ప పునీతుని జీవితం దేవుని మంచితనంలోని ఏదో ఒక అంశానికి నిదర్శనంగా నిలుస్తుంది.  కొందరు లౌకిక సంపదల పట్ల అసాధారణమైన అనాసక్తితో జీవిస్తారు, కొందరు అచంచలమైన నిబద్ధతతో పేదలకు సేవ చేస్తారు, కొందరు గాఢమైన ప్రార్థనా జీవితం గడుపుతారు, కొందరు ఆధ్యాత్మిక రహస్యాల వెల్లడి పొందుతారు, కొందరు సంపుటాల కొద్దీ…

ధ్యానం 236: అందరికీ కారుణ్యం కోసం ప్రార్థించడం

ప్రతి వ్యక్తీ ప్రత్యేకమైనవారే; మన ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా మనలో ప్రతి ఒక్కరిపైనా తన కారుణ్యాన్ని సమృద్ధిగా కురిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు.  మనం ప్రజల కోసం ప్రార్థించేటప్పుడు, వారిని వ్యక్తిగతంగానూ, సమూహాలుగానూ దేవునికి సమర్పించడం మంచిది…