ఆంగ్లంలో వినండి
సాధారణంగా మనం “శ్రమానుభవం”, “సేదదీర్పు” అనే పదాలను కలిపి వాడము. క్రీస్తు శ్రమానుభవం సేదదీర్పును ఎలా ఇవ్వగలదు? భూలోక దృష్టితో చూస్తే అది కేవలం భయానకమైనదిగా, దుఃఖకరమైనదిగా మాత్రమే కనిపిస్తుంది. ప్రభువు ఎంతో బాధపడ్డారు; మన ధన్యమాత కూడా ఆయనతోపాటు అత్యంత దుఃఖభరిత హృదయంతో బాధపడ్డారు. అయినప్పటికీ, ఈ కార్యంలో వారిద్దరూ గొప్ప సేదదీర్పును కూడా పొందారు. ఎందుకంటే ఈ శ్రమానుభవం నిర్మలమైన ప్రేమ స్వరూపం. మరేదీ ఇవ్వలేనంత సేదదీర్పును ప్రేమ మనకు ఇస్తుంది. మన ప్రభువు శ్రమానుభవాన్ని మీరు ధ్యానించినప్పుడు, బాధపడుతున్న ఆయన ఆత్మకు మీరు కూడా ఆనందాన్ని, సేదదీర్పును అందిస్తారు; ఆయన సిలువ శ్రమలలో మీరు పాలుపంచుకున్నప్పుడు మీ సొంత సిలువలు కూడా రూపాంతరం చెందుతాయి (చూడండి డైరీ #1657).
మన ప్రభువు శ్రమానుభవాన్ని ధ్యానించడం ఎన్నడూ ఆపకండి. అది మీ హృదయంపై చెరగని ముద్ర వేసిన చిత్రంగా మారాలి. నిర్మలమైన ప్రేమతో కూడిన ఈ కార్యాన్ని మీరు ఎంత తరచుగా ధ్యానిస్తున్నారో ఆలోచించండి. దానిని మీరు అర్థం చేసుకుంటున్నారా? ఇంతటి కానుకను సమర్పించేలా మన ప్రభువును ప్రేరేపించిన ప్రేమను, కనికరాన్ని మీరు చూస్తున్నారా? ఈ రోజు మీ దృష్టిని ఆయన శ్రమానుభవంపై నిలిపి, సేదదీర్పునిచ్చే ఈ పరిపూర్ణ కారుణ్య కార్యం నుండి ఎన్నడూ మరల్చకండి.
ప్రభువా, నీ శ్రమానుభవాన్ని దాని నిజస్వరూపంలో చూడటానికి నాకు సహాయం చేయుము. నిన్ను ఈ క్షణం వరకు నడిపించిన ప్రేమను నేను చూడగలిగేలా, దానిని కప్పి ఉంచిన నీ బాధల, వేదనల తెరను దయచేసి తొలగించుము. ఈ సౌందర్యాన్ని నేను తిలకిస్తూ నీకు ఆనందాన్ని కలిగించి, నీ కారుణ్యం ద్వారా రూపాంతరం పొందుదును గాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
డిసెంబరు 8 – పరిశుద్ధ కన్య మరియమ్మ అమలోద్భవ మహోత్సవం
పునీత ఆండ్రూ క్రిస్మస్ నవదిన ప్రార్థన
సంప్రదాయంగా నవంబరు 30 నుండి క్రిస్మస్ పర్వదినానికి ముందు రోజు వరకు రోజుకు 15 సార్లు ప్రార్థిస్తారు.
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు





