తెలుగు

ధ్యానం 350: ఆరాధనలో సౌందర్యం

విల్‌కాంకర్, CC BY-SA 4.0, వికీమీడియా కామన్స్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

లోకం అందంగా ఉంది, దేవుని సౌందర్యాన్ని వెల్లడిస్తుంది. అయితే పవిత్ర దివ్యసత్ప్రసాదం వంటి ఆధ్యాత్మిక వాస్తవాలు మరెంతో సుందరమైనవి.  అతి పవిత్ర దివ్యసత్ప్రసాదంలో సన్నిహితుడై ఉన్న దేవుని సౌందర్యాన్ని చూడటానికి మీకు విశ్వాస నేత్రాలు అవసరం.  ఈ సౌందర్యాన్ని మరింత స్పష్టంగా దర్శించడానికి ఉత్తమ మార్గాలలో ఆరాధన ఒకటి.  పవిత్ర దివ్యసత్ప్రసాద స్వీకరణ మన ప్రభువుతో మనం అనుభవించే అత్యున్నత ఐక్యంగా ఉండాలి. అయినప్పటికీ, పవిత్ర హోస్తియాలో సన్నిహితుడై ఉన్న ఆయనను ఆరాధించడం, ఆయన సౌందర్యాన్ని వెల్లడించడం ద్వారా ఈ కలయికకు మిమ్మల్ని సిద్ధపరుస్తుంది.  బలిపీఠంపై దివ్యసత్ప్రసాద ప్రదర్శన పాత్రలో ఉంచబడిన ఆయనను ఆరాధించడానికి ప్రయత్నించండి. ఆయన సౌందర్యానికి మీ ఆత్మనేత్రాలు ముగ్ధమయ్యేలా అనుమతించండి (చూడండి దినచర్య #1692).

మీరు ఎప్పుడైనా అతి పవిత్ర దివ్యసత్ప్రసాద ఆరాధనలో పాల్గొంటారా?  మీ దేవాలయంలో క్రమం తప్పకుండా ఆరాధన జరుగుతుంటే, అది మీకు లభించిన దీవెన.  అలా జరగకపోతే, సమీపంలోని ఏదైనా దేవాలయంలో ఆరాధన జరిగే చోటును వెదకండి.  ఆరాధన మీ ఆత్మను పోషిస్తుంది, దేవుని సౌందర్యాన్ని మీకు వెల్లడిస్తుంది.  దివ్యసత్ప్రసాద ఆరాధనలో మీ అనుభవాన్ని గురించి ధ్యానించి, ఈ మహిమాన్వితమైన కార్యంలో మనస్ఫూర్తిగా పాల్గొనడానికి మిమ్మల్ని మీరు తిరిగి అంకితం చేసుకోండి.

ప్రభువా, అతి పవిత్ర దివ్యసత్ప్రసాదంలో నా ముందు సన్నిహితుడవై ఉన్న నిన్ను అత్యంత గాఢమైన ఆరాధనతో ఆరాధిస్తున్నాను.  నేను నిన్ను ప్రేమిస్తున్నాను; నీ గుప్త సౌందర్యాన్ని, వైభవాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.  ప్రియమైన ప్రభువా, నీవు మహిమాన్వితుడవు.  నీ మహిమను తిలకిస్తున్న నన్ను, కారుణ్యంతో నిండిన నీ పరిపూర్ణ హృదయంలోకి మరింత లోతుగా ఆకర్షించు.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఆగమనకాల వనరులు

పునీత ఆండ్రూ క్రిస్మస్ నవదిన ప్రార్థన
సంప్రదాయంగా నవంబరు 30 నుండి క్రిస్మస్ పర్వదినానికి ముందు రోజు వరకు రోజుకు 15 సార్లు ప్రార్థిస్తారు.

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు