తెలుగు

ధ్యానం 84: పవిత్ర హోస్తియా

దివ్యసత్ప్రసాద ఆరాధనా పాత్రలోని దివ్యసత్ప్రసాదంలో యేసు, needpix.com ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

అతిపవిత్ర దివ్యసత్ప్రసాదంలో సన్నిధిగా ఉన్న క్రీస్తును మనం ఎంత గాఢంగా ప్రేమించి ఆరాధించినా అది సరిపోదు.  అతిపవిత్ర దివ్యసత్ప్రసాదంలో సన్నిధిగా ఉన్న ఆయన ఎదుట ఉన్నప్పుడు, మరుగైన రూపంలో సన్నిధిగా ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం చూడాలి.  ఆయనే: కారుణ్యం, నిత్యజీవం, నిత్య దేవుడు, పాపుల రక్షకుడు, జీవజలం, నిర్మల ప్రేమాగ్ని, మన వ్యాధులన్నిటికీ ఔషధం, ప్రేమానుభూతులన్నీ, అందరి ఆశ, భారాలను తొలగించేవాడు… మన నమ్మకాన్నంతా ఆయనపై ఉంచడం సముచితం (చూడండి దినచర్య #356).

పవిత్ర హోస్తియాను తదేకంగా చూస్తున్నప్పుడు మీకు ఏమి కనిపిస్తుంది?  మీ కళ్లకు రొట్టె కనిపిస్తుంది, కానీ మీ ఆత్మతో మీరు దేవుణ్ణి చూడాలి.  ఆయన మహిమను, శక్తిని సంపూర్ణంగా దర్శించి, మీ శక్తినంతటితో ఆయనను ఆరాధించాలి.  పవిత్ర దివ్యసత్ప్రసాదంలో సన్నిధిగా ఉన్న మన ప్రభువుతో మీ అనుబంధం ఎలా ఉందో ఆలోచించండి.  దేవుడు తనను గురించిన నిజమైన జ్ఞానంతో మీ మనస్సును నింపాలని, జ్వలించే ప్రేమతో మీ హృదయాన్ని ప్రేరేపించాలని ప్రార్థించండి.

ప్రభువా, అతిపవిత్ర దివ్యసత్ప్రసాదంలో సన్నిధిగా ఉన్న నిన్ను తెలుసుకొని ప్రేమించడానికి నాకు సహాయం చేయి.  ఈ పవిత్ర వరం ద్వారా మాకు అందుబాటులోకి వచ్చిన నీ కారుణ్య వరాన్ని అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయి.  ఈ పవిత్ర హోస్తియాలోని నీ సన్నిధి ఎదుట ఉన్న ప్రతిసారీ నిన్ను ఆరాధించడం నేర్చుకునేలా చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ముప్పై ఒకటవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు

మార్చి 25 – ప్రభువు జననవార్త ప్రకటన

తపస్సుకాలానికి ఉపయోగకరమైన వనరులు

తపస్సుకాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు