తెలుగు

ధ్యానం 56: నేటి శుభవార్త

పిక్సాబే లో డాన్ ఫేడర్ అందించిన చిత్రం

వీడియో

ఆంగ్లంలో వినండి

లౌకిక ప్రపంచం చెడు వార్తలతో నిండిపోయింది. మన దృష్టిని తమవైపు నిలుపుకోవడానికి వార్తాపత్రికలు, చర్చా కార్యక్రమాలు, ఇతర ప్రసార మాధ్యమాలు విషాద సంఘటనలను సంచలనాత్మకంగా, అతిశయోక్తులతో చూపిస్తూ వర్ధిల్లుతున్నాయి. మన వంతుగా మనం కూడా తాజా వదంతులను లేదా విమర్శలను పంచుకోవడానికి తరచూ ఉత్సాహపడుతుంటాం. కానీ శుభవార్త సంగతేమిటి? దేవుని అపారమైన కారుణ్యం గురించిన వార్త సంగతేమిటి? ఈ సందేశం మిమ్మల్ని ఎంత తరచుగా ఆకట్టుకుంటుంది? దేవుని కారుణ్యం గురించి లోకానికి తెలియజేయడానికి మీరు ఎంత తరచుగా ప్రయత్నిస్తారు? (చూడండి: డైరీ #164)

ప్రతిరోజూ ఇతరులతో పంచుకోవడానికి మీరు ఎక్కువగా ఉత్సాహపడేది ఏమిటో ధ్యానించండి. దేవుని మంచితనం, కారుణ్యం గురించి మాట్లాడినప్పుడు మీకు కలిగే ఆనందం గురించి ఆలోచించండి. దేవుడు ఎంత గొప్పవాడో తెలిపే ఆనందాన్ని కొంతైనా పంచుకోవడానికి ఈ రోజు అవకాశాల కోసం చూడండి. ఈ వారంలో దేవుని సౌందర్యం, మంచితనం ఏయే విధాలుగా స్పష్టమయ్యాయో గమనించండి. దేవుడు మీకు ఎదురుపరిచే వారితో ఆయన చేసిన కార్యాల గురించి మాట్లాడండి.

ప్రభువా, లౌకిక ప్రపంచంలోని సంచలన ధోరణి నుండి, ప్రతికూలత నుండి దూరంగా మళ్లడానికి నాకు సహాయం చేయి. వాటికి బదులుగా, నా దృష్టిని నీవైపు, నీ మహిమవైపు మళ్లించడానికి నాకు సహాయం చేయి. నేను నీ గురించి స్వేచ్ఛగా, ఆనందంగా మాట్లాడగలిగేలా నాకు ధైర్యాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను ప్రసాదించు. ప్రభువా, అన్ని చోట్లా పంచుకోవలసిన శుభవార్త నీవే. ఈ కార్యంలో ఇష్టపూర్వకంగా నీ సాధనంగా ఉండటానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ప్రతిరోజూ సువార్త ధ్యానాలను, దైవకారుణ్య ధ్యానాలను ఈమెయిల్ ద్వారా పొందండి!

ఏడవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు