తెలుగు

ధ్యానం 62: జీవితంలోని చిన్న త్యాగాలు

గెయోర్గ్ ఫ్రీడ్రిఖ్ స్టెట్నర్ († 1639) కృతిగా భావించబడినది, వికీమీడియా కామన్స్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

చిన్న త్యాగాలకు విలువ ఉందా? కొన్నిసార్లు మనం గొప్ప పనులు చేయడానికి ప్రయత్నించాలని అనుకోవచ్చు. కొందరు గొప్పతనం గురించిన ఆలోచనలతో, గొప్ప కార్యాలను సాధించాలని కలలు కనవచ్చు. అయితే మనం ప్రతిరోజూ చేసే చిన్న, ఏకరీతిగా సాగే త్యాగాల సంగతి ఏమిటి? శుభ్రం చేయడం, వంట చేయడం, మరొకరికి సహాయం చేయడం, క్షమించడం మొదలైన త్యాగాల సంగతి ఏమిటి? చిన్న పనులకు విలువ ఉందా? నిస్సందేహంగా ఉంది. అవి మనం దేవునికి అర్పించే సాటిలేని నిధి. ప్రతిరోజూ చేసే చిన్న త్యాగాలు విశాలమైన లోయలో, కనుచూపు మేర అందమైన అడవి పూలతో నిండిన మైదానం వంటివి. ఒక్క పువ్వే ఎంతో అందంగా ఉంటుంది. అయితే ప్రతిరోజూ, రోజంతా ఈ చిన్న ప్రేమకార్యాలు చేయడానికి మనం అంకితమైతే, అంతులేని అందంతో, వైభవంతో అలలాడే పూలమైదానాన్ని దేవునికి సమర్పిస్తాము (చూడండి: దినచర్య #208).

ఈ రోజు చిన్న విషయాల గురించి ధ్యానించండి. ప్రతిరోజూ మీరు చేసే పనుల్లో మీకు అలసట కలిగిస్తూ, విసుగ్గా లేదా అప్రధానంగా అనిపించేవి ఏమిటి? బహుశా మరే ఇతర పనులకన్నా ఈ పనులే దేవుణ్ణి గొప్పగా ఘనపరచి మహిమపరచడానికి మీకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాయని తెలుసుకోండి.

ప్రభువా, నా ఈ రోజును నీకు అర్పిస్తున్నాను. నేను చేసేదంతా నీకు అర్పిస్తున్నాను; నన్ను నేను సంపూర్ణంగా నీకు అర్పిస్తున్నాను. ముఖ్యంగా, ప్రతిరోజూ నేను చేసే చిన్న పనులను నీకు అర్పిస్తున్నాను. నా ప్రతి పని నీకు కానుకగా మారి, ఈ రోజంతా నీకు ఘనతను, మహిమను అర్పించుగాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పన్నెండవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు

తపస్సుకాల వనరులు

మార్చి 3 – పునీత కేథరిన్ డ్రెక్సెల్, కన్య

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు