చిత్రం అందించినవారు: జన్నిఫర్ బాయా వేదిక: పిక్సాబే
ఆంగ్లంలో వినండి
చాలా తరచుగా, మీరు వినవలసిన ఒక ప్రత్యేక సందేశాన్ని దేవుడు మీకు చెప్పాలని కోరుకుంటారు. మీరు ప్రసంగం వింటున్నప్పుడు, పుస్తకం చదువుతున్నప్పుడు, రేడియోలో ఏదైనా వింటున్నప్పుడు లేదా స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, ఇతరులపై ప్రభావం చూపుతున్నట్లు అనిపించని ఏదో ఒక ప్రత్యేకమైన విషయం మీ దృష్టిని బలంగా ఆకర్షించవచ్చు. ఈ ప్రేరణను గమనించండి. ఇది దేవుని కారుణ్యం మీకు అందించే వరం, మీ పట్ల ఆయనకున్న ప్రేమకు ప్రకటన (చూడండి దినచర్య #456).
ఇటీవల మీ దృష్టిని ఆకర్షించిన ఏదైనా విషయం గురించి ధ్యానించండి. ప్రత్యేకంగా మీకోసమే చెప్పినట్లు అనిపించిన మాటలు ఏవైనా విన్నారా? ఏదైనా విషయం మీ మనసులో మెదులుతోందా? అలా అయితే, ఆ ఆలోచనతో కొంత సమయం గడపండి. అది ప్రభువు నుండి వచ్చినదేనా, దాని ద్వారా ఆయన మీకు ఏమి చెబుతున్నారో వివేచించడానికి ప్రయత్నించండి. ఇది మీతో మాట్లాడుతున్న దేవుని స్వరం కావచ్చు, ఆయన గొప్ప కారుణ్యానికి నిదర్శనం కావచ్చు.
ప్రభువా, నీ స్వరాన్ని వినాలని కోరుకుంటున్నాను. నాతో పలుకబడే నీ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించడానికి నాకు సహాయం చేయి. నీవు మాట్లాడినప్పుడు, వినడానికి, ఉదారతతోను ప్రేమతోను నీకు స్పందించడానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
తొమ్మిదవ రోజు: దైవకారుణ్య ఆదివారానికి సిద్ధపరిచే నవదిన ప్రార్థన
ఏప్రిల్ 11 – పునీత స్తనిస్లాస్, పీఠాధిపతి, వేదసాక్షి
(పాస్కా అష్టదినోత్సవంలో వస్తున్నందున ఈ సంవత్సరం ఆరాధనాక్రమ స్మరణదినంగా జరుపుకోరు)
పాస్కా కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు





