డియోస్ — కై స్టాఖోవియాక్ కృతి
వీడియో ఆంగ్లంలో వినండి
మీరు పది లక్షల డాలర్లు గెలుచుకుంటే, “వద్దు, నాకు కేవలం $100 ఇవ్వండి, నాకు కావలసింది అంతే” అని బహుశా అనరు. అయినా దేవుని కారుణ్యం విషయంలో మనం తరచూ చేసేది అదే. దేవుడు సమృద్ధిగా సంపదను అందిస్తుంటే, మనం మాత్రం అందులో కొద్దిభాగాన్నే తీసుకోవాలని ఎంచుకుంటాం. ఎందుకలా? ఆయన కారుణ్యానికి హద్దులు లేవు. అది అనంతమైనది. దేవుడు మన ఆత్మలలో చేయాలని కోరుకునేదంతా మనం అర్థం చేసుకుని, ఆ తరువాత ఆయనతో సహకరించి, దానిని చేయడానికి ఆయనను అనుమతిస్తే, వెలకట్టలేని ఈ నిధిని కనుగొన్నందుకు మనం పూర్తిగా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయి, నిత్యమూ కృతజ్ఞతతో ఉంటాం. ఆయన కారుణ్యాన్ని మరింత సంపూర్ణంగా స్వీకరించడంలో చాలామంది ఎదుర్కొనే సమస్య బహుశా అది సాహసంతో కూడుకున్నది కావడమే. మనం మారవలసి ఉంటుంది అనే అర్థంలో అది సాహసంతో కూడుకున్నది. పది లక్షల డాలర్లు మీ జీవితాన్ని మారుస్తాయా? బహుశా మార్చవచ్చు. అవి మీ జీవితంలో అనేక విషయాలను మార్చే అవకాశమే ఎక్కువ; ఆ మార్పులు తప్పనిసరిగా మేలు చేసేవే కానక్కరలేదు. కానీ దేవుని కారుణ్యం అనంతంగా ఎక్కువ విలువగల నిధి. వెనుకాడకండి! దానిని స్వీకరించడానికి, అది మిమ్మల్ని మేలు వైపు మార్చడానికి అనుమతించే సాహసం చేయండి (చూడండి డైరీ #1017).
దేవుని కారుణ్యాన్ని స్వీకరించడానికి మీరు వెనుకాడుతున్నారా? అలా అయితే, ఈ విషయాన్ని గుర్తించడం, దాన్ని అంగీకరించడం, దానికి గల కారణాన్ని ఎదుర్కోవడం ముఖ్యం. దేవుడు అనుగ్రహించాలని కోరుకునే వాటన్నిటినీ స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా ఉండే ఆత్మ అరుదు. దేవుని కారుణ్యానికి తనను తాను పూర్తిగా అప్పగించుకోవడమనే సాహసానికి భయపడని ఆత్మ అరుదు. ఆ అరుదైన ఆత్మలలో ఒకరిగా ఉండాలని నిర్ణయించుకోండి. దేవుడు మీపై కుమ్మరించాలని కోరుకునే వాటన్నిటినీ సంకోచించకుండా స్వీకరించండి. ఆయన కృప మీ జీవితాన్ని మార్చడాన్ని చూసి ఆనందించండి.
ప్రియాతిప్రియమైన ప్రభువా, నీ సమృద్ధియైన కారుణ్యానికి నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నీ కృపాసంపదలను నా జీవితంపై ఎడతెగకుండా కుమ్మరించాలనే తపనతో రగిలిపోయేంత పరిపూర్ణమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ మహిమగల వరం ఎదుట నా సంకోచాలన్నిటినీ విడిచిపెట్టి, నిన్ను, నీ కారుణ్యం నా ఆత్మలో చేయబోయే వాటన్నిటినీ మనఃపూర్వకంగా స్వీకరించుదును గాక. ప్రియమైన ప్రభువా, నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




