తెలుగు

ధ్యానం 312: నిజమైన, విశ్వసనీయమైన స్నేహితులు

బాధపడుతున్న వ్యక్తితో స్నేహాన్ని కొనసాగించడం కష్టం; ముఖ్యంగా ఆ బాధ దీర్ఘకాలం కొనసాగుతున్నప్పుడు మరింత కష్టం. తరచుగా, ఒక వ్యక్తి ఏదైనా అనారోగ్యంతో లేదా ఇతర కష్టంతో బాధపడుతున్నప్పుడు, మొదట్లో సహాయం చేయడానికి చాలామంది స్నేహితులు వస్తారు. కానీ కాలం గడిచేకొద్దీ, తమ ప్రేమను, తోడ్పాటును కొనసాగించే స్నేహితుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది…

మరింత చదవండి

ధ్యానం 311: వినయం యొక్క సత్యం

వినయం అనే మహిమాన్వితమైన సద్గుణాన్ని అర్థం చేసుకోవాలి, నిరంతరం మననం చేయాలి, నిరంతరం అలవరచుకోవాలి.  వినయం అంటే ఏమిటి?  మీ గురించి సత్యాన్ని తెలుసుకోవడం, ఆ సత్యాన్ని నమ్మడం, ఆ సత్యానికి అనుగుణంగా జీవించడం తప్ప మరేమీ కాదు.  మీ అంతఃకరణపు లోతులు మీకూ దేవునికీ మాత్రమే తెలుసు.  మానవ…

మరింత చదవండి

ధ్యానం 310: దుష్టుని మూర్ఖత్వం

సాతాను నిజంగా ఉన్నాడు; అతని శోధనలు కూడా నిజమైనవే. అతను మిమ్మల్ని పూర్తిగా ద్వేషిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటాడు. ఇది తెలుసుకోవడం మంచిది. అయితే దుష్టుడు ఎంతో జిత్తులమారి; ఇతరులను తనకు అనుకూలంగా మలచుకుంటాడు. పచ్చి అబద్ధాలతో చేసే శోధన చాలా మటుకు మిమ్మల్ని ఒప్పించలేదని అతనికి తెలుసు కాబట్టి, అతను మీతో అలాంటి అబద్ధాలు చెప్పడం అరుదు…

మరింత చదవండి

ధ్యానం 309: ఇతరులతో సంభాషించడం

మనం మరొకరితో సంభాషించే ప్రతిసారీ దేవుని ప్రేమను పంచుకునే అవకాశం లభిస్తుంది. సాధారణ సంభాషణలో కూడా అలాంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఎదుటి వ్యక్తి తన జీవిత విశేషాలను చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినడం, వారి పట్ల మీకున్న శ్రద్ధను, ఆపేక్షను వ్యక్తపరుస్తుంది; వారి గౌరవాన్ని మీరు గుర్తిస్తున్నారనే విషయాన్ని వెల్లడిస్తుంది…

మరింత చదవండి

ధ్యానం 308: తల్లి ప్రేమ

ఈ లోకంలోని ఏ రూపమూ దేవుని పరిపూర్ణ ప్రేమను పూర్తిగా వెల్లడించలేదన్నది నిజం.  దేవుడు సమస్తానికీ అతీతుడు; ఆయన ప్రేమ ఈ లోకంలో ఇమడలేనంత గొప్పది.  అయినప్పటికీ, ఈ లోకంలోని అనేక విషయాలు దేవుని ప్రేమలోని వివిధ అంశాలను వెల్లడిస్తాయి.  అలాంటి ఒక రూపం తల్లి ప్రేమ.  అయితే…

మరింత చదవండి

ధ్యానం 307: దివ్య మిత్రునితో సంభాషించడం

ప్రార్థనలో ఒక ఏకాంతవాసి, గెరిట్ డౌ చిత్రశాల వారి కృతి Video మీరు ఎలా ప్రార్థిస్తారు? ప్రార్థించడానికి ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయి. సాధారణంగా అనుసరించే కొన్ని మార్గాలు ఇవి: దివ్యబలిపూజలో లేదా మరొక ఆరాధనా వేడుకలో పాల్గొనడం, జపమాల లేదా ఇతర జపమాలికలను ప్రార్థించడం, …

మరింత చదవండి

ధ్యానం 306: ఎన్నడూ విరమించని దేవుడు

దేవుని ప్రేమను మీరు సందేహిస్తున్నారా? నిజమేమిటంటే, మిమ్మల్ని వెదకడంలో దేవుడు ఎన్నడూ విరమించడు. మన పవిత్రత చాలావరకు మనపై ఆధారపడినా, దానిలో అత్యధిక భాగం దేవునిపైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఈ భూమిపై ఉన్నంతకాలం, దేవుడు మిమ్మల్ని వెదకడం, మీ హృదయపరివర్తనను కోరడం ఎన్నడూ ఆపడు. ఆయన తన కారుణ్యాన్ని…

మరింత చదవండి

ధ్యానం 305: దేవుని ప్రేమలోని లోతులు

మీపై ప్రేమతో ఎవరైనా మీకోసం తమ ప్రాణాన్ని అర్పించారని ఊహించండి.  తాము స్వచ్ఛందంగా తమ ప్రాణాన్ని అర్పించకపోతే మీరు ప్రాణాలు కోల్పోతారని వారికి తెలిసిన పరిస్థితి ఎదురైంది.  అందుకే, వారు ధైర్యంగా ముందుకు వచ్చి, మీ ప్రాణానికి బదులుగా తమ ప్రాణాన్ని అర్పించాలని నిర్ణయించుకున్నారు.  ఇలా చేయాలంటే…

మరింత చదవండి

ధ్యానం 304: అన్ని విషయాలలో సత్యం

మనం సత్యానికి భయపడాలా? ఒక విధంగా చూస్తే సత్యం మనలను కష్టాలలో పడవేయవచ్చు. ఉదాహరణకు, వేదసాక్షులను చూడండి. వారు తమ రక్తాన్ని చిందించడం ద్వారా సత్యానికి సాక్షులయ్యారు. సత్యానికి వారు ఇచ్చిన సాక్ష్యం వారిపై హింసకు దారితీసిందనే అర్థంలో మాత్రమే వారు “కష్టాలలో పడ్డారు.” కానీ…

మరింత చదవండి

ధ్యానం 303: నిశ్శబ్దం

మన ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అనేకమంది ఎదుర్కొనే ప్రమాదాల్లో నిరంతర శబ్దం ఒకటి.  రోజంతా మాటల మోత మనల్ని సులభంగా ముంచెత్తుతుంది.  అది రేడియో, టీవీ, ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, లేదా మరొకరి ఎడతెగని సంభాషణ ద్వారా కావచ్చు.  అరుదుగా మాత్రమే మనకు లభించేవి గాఢమైన…

మరింత చదవండి