తెలుగు

ధ్యానం 29: ఓదార్పు క్షణాలు

మనం ప్రతిరోజూ పూర్ణహృదయంతో దేవుణ్ణి వెదకుతుంటే, సరిగ్గా తగిన సమయంలో మనకు ఒక ఓదార్పు క్షణం లభిస్తుందని గ్రహిస్తాం.  అది ఊహించని శాంతి లేదా ఆనందం కావచ్చు, మనకు జ్ఞానోదయం కలిగినట్లు, ప్రోత్సాహం లభించినట్లు అనిపించవచ్చు, లేదా దేవుని సాన్నిధ్యాన్ని మన…

ధ్యానం 27: సద్గుణంగా రూపాంతరం చెందిన కష్టపరీక్షలు

కొన్నిసార్లు దేవుడు మనకు కష్టపరీక్షలను విధిస్తారు.  మనల్ని బలపరచడానికి, ఆయన పట్ల మన ప్రేమను మరింత గాఢం చేయడానికి ప్రేమతోనే ఇలా చేస్తారు.  మీరు దేనిని కష్టపరీక్షగా అనుభవిస్తున్నారో గమనించండి.  అది ఆయన నుంచే వచ్చిందా, ఆ కష్టపరీక్ష ద్వారా ఆయన ఏ మేలును కలిగించాలని కోరుకుంటున్నారో దేవుణ్ణి అడగండి.  కష్టపరీక్షలకు ఎల్లప్పుడూ ఈ సామర్థ్యం ఉంటుంది…

ధ్యానం 18: యాజకుల ద్వారా ప్రసాదించబడే కారుణ్యం

కారుణ్యం ఎన్నో విధాలుగా ప్రసాదించబడుతుంది. కారుణ్యాన్ని అందించే అనేక మార్గాలలో, దేవుని పవిత్ర యాజకుల ద్వారా దానిని పొందడానికి ప్రయత్నించండి. ఆయన యాజకుడు మీ మాట వినడానికి, మీతో మాట్లాడడానికి, మీకు మార్గనిర్దేశం చేయడానికి అవకాశం ఇవ్వండి. యాజకులు బలహీనులు, పాపులు కూడా. అయితే వారి బలహీనతలోనే ఆత్మలకు మార్గనిర్దేశం చేయడానికి వారికి ప్రత్యేక కృప ప్రసాదించబడుతుంది. ఆ…

ధ్యానం 8: దైవకారుణ్య జపమాలపై మననం

పునీత ఫౌస్టీనా దినచర్య వివిధ మార్గాలలో ఒక నూతన భక్తి విధానానికి మనలను పిలుస్తుంది.  మూడవ మార్గం దైవకారుణ్య జపమాల ద్వారా లభిస్తుంది.  ఈ జపమాల ఒక అమూల్యమైన వరం. ప్రతిరోజూ తప్పక జపించేందుకు మనం కృషి చేయవలసిన వరం ఇది…

featured image DM

పరిచయం – 365 రోజుల దైవకారుణ్య ప్రయాణం ప్రారంభమవుతోంది!

నేడు మనం జీవిస్తున్న ప్రపంచం హింస, అస్తవ్యస్తత, నిరాశ, అంతరంగ ఏకాకితనం పెరిగిపోతున్న ప్రపంచం.  దైనందిన వార్తాశీర్షికలు, సామాజిక మాధ్యమాలు వంటి ఆధునిక సమాచార సాధనాల ద్వారా ఎంతోమంది పరస్పరం అనుసంధానమై ఉన్న ప్రపంచమిది.  దాని ఫలితంగా…

ధ్యానం 365: కారుణ్య రాణి

ఈ చివరి ధ్యానం కారుణ్య రాణి అయిన మహా మహిమాన్విత దేవమాతకు అంకితం చేయబడింది.  మరెవరికన్నా ఎక్కువగా ఆమె దేవుని కారుణ్యానికి పరిపూర్ణ సాధనంగా ఉండింది, ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.  దేవదూత శుభవార్త ప్రకటించినప్పుడు ఆమె తన సమ్మతితో, “అవును” అని పలకడం ద్వారా, కారుణ్యస్వరూపుడినే ఈ లోకంలోకి తీసుకువచ్చింది.  ఆమె…

ధ్యానం 362: కారుణ్యంతో నిండిన రెండు హృదయాలు

యేసు హృదయం సంపూర్ణ కారుణ్యమే. అది లోకంపై ధారాళంగా ప్రవహించే కృపకు ఊట. ఇది ఓదార్పునిస్తుంది. అయితే కారుణ్యపు ఊటగా మారవలసిన మరో హృదయం కూడా ఉంది; అదే మీ హృదయం. మీరు ప్రభువు కారుణ్యంలో ఎంతగా లీనమవ్వాలంటే, మీ హృదయం…

ధ్యానం 361: త్యాగం మరియు ప్రార్థన

దీనిని అర్థం చేసుకోవడం, నమ్మడం కష్టంగా అనిపించినప్పటికీ, స్వచ్ఛమైన ప్రార్థనతో ఏకమైన ఆంతరంగిక త్యాగం ప్రపంచమంతటా సువార్త ప్రకటనకు అపారమైన మేలు చేస్తుంది. వాస్తవానికి, ప్రతిరోజూ ఆంతరంగిక త్యాగాలను సమర్పించే పుణ్యాత్ముల శక్తి సువార్త ప్రచారకులకు లేకపోతే…

ధ్యానం 360: ఆధ్యాత్మిక పోరాటం

ప్రలోభపెట్టే సాతాను నిజంగానే ఉన్నాడు, కానీ అతనికి భయపడవలసిన అవసరం లేదు. మీరు అతనిని ఏమాత్రం పట్టించుకోకూడదు. అతని ఆలోచనలతో తలపడకూడదు. అతనితో బేరమాడకూడదు. ప్రలోభాలు ఎదురైనప్పుడు మీలో ధైర్యం, దేవుని కారుణ్యంపై నమ్మకం, నిరీక్షణ ఉండాలి. మారిపోకండి…

ధ్యానం 358: దేవుని ద్వివిధ వరం

తరచుగా, మనం దేవుని కారుణ్యం గురించి మాట్లాడేటప్పుడు, పాపక్షమాపణ గురించి మాట్లాడుతాము. ఇది దేవుని కారుణ్యపు మొదటి కార్యం. ఆయన ప్రతి పాపాన్ని, అతి స్వల్పమైన లోపాన్ని సైతం చూస్తాడు. ఈ పాపాలు మన ప్రభువుకు బాధ కలిగించినప్పటికీ, క్షమించడానికి ఆయన ఉదారంగా కారుణ్యాన్ని ప్రసాదిస్తాడు. క్షమాపణ…