తెలుగు

ధ్యానం 74: కరుణగల హృదయం

“సానుభూతి”కి, “కరుణ”కి మధ్య తేడా ఉందా?  ఉంటే, ఆ తేడా ఏమిటి?  మరి ఈ రెండింటిలో ఏది మరింత కోరదగినది?  సానుభూతి అంటే కేవలం మరొకరి పరిస్థితిని చూసి మనం బాధపడటం.  ఒక విధంగా చెప్పాలంటే, వారిపై జాలిపడటం.  కానీ కరుణ దీనికంటే ఎంతో ముందుకు వెళుతుంది.  అంటే మనం…

ధ్యానం 72: అర్థానికి అందని రహస్యం

దేవుడు మీ ఆత్మలోకి ప్రవేశించినప్పుడు, ఆయన చేసే కార్యాలను మీరు ఎన్నటికీ పూర్తిగా అర్థం చేసుకోలేని విధంగా పనిచేస్తారు.  ఆయన కృప, కారుణ్యం సముద్రాలకంటే లోతైనవి, విశ్వపు అత్యున్నత హద్దులకంటే విశాలమైనవి అయిన రహస్యంగా నిలిచి ఉంటాయి.  అర్థానికి అందని స్వభావాన్ని అర్థం చేసుకోవడం…

ధ్యానం 71: మన అల్పత్వం, శూన్యత

మనం ఉన్నదున్నట్లుగా మనల్ని మనం చూసుకోగలగడం దేవుని కృప.  మరి మనల్ని మనం ఇలా చూసుకుంటే ఏమి కనిపిస్తుంది?  మన దయనీయ స్థితి, శూన్యత కనిపిస్తాయి.  మొదట్లో ఇది అంత కోరదగినదిగా అనిపించకపోవచ్చు.  క్రీస్తులో మనకున్న గౌరవానికి ఇది విరుద్ధంగా కూడా అనిపించవచ్చు.  కానీ కీలకమైన విషయం అదే.  మన…

ధ్యానం 67: ప్రేమ యొక్క గుప్త గులాబీలు

కొన్ని ప్రేమచర్యలు ప్రేమించుకునే ఇద్దరి మధ్య మాత్రమే పంచుకోవడానికి ఉద్దేశించినవి. అత్యంత సాన్నిహిత్యంతో, ఆత్మార్పణతో చేసే కార్యాలు ప్రేమబంధంలోని ఏకాంతంలో పంచుకునే అమూల్యమైన ప్రేమకానుకలు. దేవునిపట్ల మన ప్రేమ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. మన అత్యంత గాఢమైన ప్రేమను వ్యక్తపరచే మార్గాలను మనం క్రమం తప్పకుండా వెదకాలి…

ధ్యానం 63: మీరు ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారు?

ఇతరులతో మాట్లాడేటప్పుడు, దేవుని ప్రేమ, కరుణ మన పెదవుల నుండి ప్రవహించాలి.  కానీ ఎలా?  మన మాటలు ఎలా ఉండాలి?  మనం దేవునితో ఎలా మాట్లాడాలో అనే వెలుగులో ఇతరులతో మనం మాట్లాడే తీరును పరిశీలించుకోవచ్చు.  దేవునితో మాట్లాడేటప్పుడు మనం నిజాయితీతో మాట్లాడాలి…

ధ్యానం 60: ఆధ్యాత్మిక కరవును ఎదుర్కోవడం

కొన్నిసార్లు మీ ఆత్మ ఆధ్యాత్మిక కరవులో ఉన్నట్లు మీకు అనిపిస్తుందా?  మీ దైనందిన జీవితంలో మరింత ఆధ్యాత్మిక ఓదార్పు పొందగలిగితే బాగుండునని కోరుకుంటున్నారా?  ఇది సాధారణంగా ఎదురయ్యే ఒక పోరాటం; దీని గురించి మనం ఆందోళన చెందకూడదు.  దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మన ఆధ్యాత్మిక జీవితపు ప్రధాన లక్ష్యం.  తరచుగా…

ధ్యానం 44: ప్రభువు దృష్టి భయాన్ని పారద్రోలుతుంది

మన ప్రభువు రాత్రింబగళ్లు పరిపూర్ణమైన ప్రేమానురాగాలతో మిమ్మల్ని చూస్తున్నారని మీకు తెలుసా.  మీ జీవితంలోని ప్రతి వివరమూ ఆయనకు తెలుసనీ, ప్రతి పరిస్థితిలోనూ ఆయన మీతో నడుస్తున్నారనీ మీకు తెలుసా?  ఇది నమ్మడం కష్టంగా అనిపించవచ్చు, ఎందుకంటే మనం ఆయన స్వరాన్ని చెవులతో వినలేము, ఆయనను మన కళ్లతో చూడలేము, లేదా…

ధ్యానం 38: మన దైనందిన కర్తవ్యం

తమ జీవితాలు నిరుత్సాహంగా, ఏకరీతిగా సాగుతున్నాయని కొందరికి అనిపించవచ్చు.  రోజూ అదే పని, అదే తీరు. కొన్నిసార్లు మనం ఏదైనా కొత్త ఉత్సాహాన్ని, అనుభవాన్ని వెదుకుతాం.  కానీ జీవితంలోని సరళమైన, మళ్లీ మళ్లీ ఎదురయ్యే, ఏకరీతిగా సాగే అంశాలన్నిటిలోనూ ప్రతిరోజూ అనుగ్రహం మనకు తోడుగా ఉండటానికి మనం అనుమతిస్తే…

ధ్యానం 34: దేవునిలో మాత్రమే తృప్తి

జీవితంలో మనం తరచూ లౌకికమైన, గతించిపోయే విషయాలు మనకు తృప్తినిస్తాయని నమ్మే ఉచ్చులో పడిపోవచ్చు. మన పాపాలు మనకు తృప్తినిస్తాయని భావిస్తూ కూడా మోసపోవచ్చు. వింతగా అనిపించినా, అవి ఒక రకమైన తాత్కాలిక తృప్తిని ఇస్తాయి. కానీ ఈ “తృప్తి”…

ధ్యానం 30: దేవునికి విధేయత

పవిత్రతకు ఒక కీలక మార్గం విధేయత.  ఆదాము హవ్వలు అవిధేయత వల్ల అనుగ్రహ స్థితిని కోల్పోయారు; విధేయత ద్వారా మనం తిరిగి అనుగ్రహ స్థితిని పొందుతాము.  విధేయత కష్టంగా ఉండవచ్చు; దానికి హృదయాంతరాళంలో దృఢమైన నిర్ణయం అవసరం.  యేసుకు విధేయత చూపే అవకాశాలను వెదకండి, ముఖ్యంగా మీకు…