తెలుగు

ధ్యానం 330: ఇతరుల కోసం ప్రార్థించడం

మీ ప్రార్థనల శక్తిని తక్కువగా అంచనా వేయకండి.  దేవుని కారుణ్యంపై మీ నమ్మకం ఎంత ఎక్కువగా ఉంటే, మీ ప్రార్థనలు అవసరమైనవారికి అంత శక్తివంతంగా ఉంటాయి.  ప్రభువుకు అన్నీ తెలుసు; ఎవరికి ఏమి అవసరమో కూడా ఆయనకు తెలుసు.  అయితే ఆయన తన కృపను అనుగ్రహించాలని కోరుకుంటున్నారు…

ధ్యానం 310: దుష్టుని మూర్ఖత్వం

సాతాను నిజంగా ఉన్నాడు; అతని శోధనలు కూడా నిజమైనవే. అతను మిమ్మల్ని పూర్తిగా ద్వేషిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటాడు. ఇది తెలుసుకోవడం మంచిది. అయితే దుష్టుడు ఎంతో జిత్తులమారి; ఇతరులను తనకు అనుకూలంగా మలచుకుంటాడు. పచ్చి అబద్ధాలతో చేసే శోధన చాలా మటుకు మిమ్మల్ని ఒప్పించలేదని అతనికి తెలుసు కాబట్టి, అతను మీతో అలాంటి అబద్ధాలు చెప్పడం అరుదు…

ధ్యానం 292: ప్రత్యేక దైవపిలుపుల విలువ

కొందరు సన్యస్త జీవితంలో భాగంగా ప్రార్థనతోను ఏకాంతంతోను కూడిన విశిష్ట జీవితానికి పిలువబడతారు.  ప్రత్యేకించి, ఏకాంత తపస్వి జీవితానికో, బాహ్య ప్రపంచానికి దూరంగా మఠంలో నివసించడానికో పిలువబడేవారు ఉన్నారు.  పవిత్రులైన వీరు లోకానికి దూరంగా ఉండి, నిశ్శబ్ద ప్రార్థనలోను పనిలోను తమ రోజులను గడుపుతారు.  కానీ…

ధ్యానం 287: అపకీర్తి అనే పైవస్త్రం

“అపకీర్తి” అంటే అందరి ముందు సిగ్గుపడటం, పరువుపోవడం, అవమానం, తలవంపు అని అర్థం కావచ్చు. అయితే యేసుకు అన్వయించినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన అర్థం వస్తుంది. “అపకీర్తి అనే పైవస్త్రం” అనేది యేసు తన సిలువ కారణంగా అందరి ముందు భరించిన అవమానాన్ని సూచిస్తుంది. ఆయనను పాపిగా, అబద్ధికునిగా ఖండించారు. ప్రజలను మోసగిస్తున్నాడని, పౌర అధికారులను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయనపై నేరారోపణ చేశారు. ఆయన గురయ్యాడు…

ధ్యానం 283: పాపాన్ని అధిగమించడం

దేవుని కారుణ్య సందేశం ఎంతో సరళమైనది. అయినా, ఈ పుస్తకంలోని అనేక పుటలను లేదా పునీత ఫౌస్తీనా దినచర్యను ధ్యానించిన తరువాత కూడా మనం దానిని సులభంగా గ్రహించలేకపోవచ్చు.  మన పాపాలను ఒప్పుకోవడానికి మనకు ఏ మాత్రం భయం ఉండకూడదనేదే దేవుని కారుణ్య సందేశం తెలియజేయవలసిన సరళమైన సత్యం…

ధ్యానం 282: బాధలు, హింసలు, దుర్వ్యవహారం మరియు అవమానం

ఈ శీర్షిక మీకు వెంటనే ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు.  వీటిని భరించాలని ఎవరు కోరుకుంటారు?  అయితే యేసు వీటన్నిటినీ అత్యంత తీవ్రంగా అనుభవించారని మనం గుర్తుంచుకోవాలి.  యేసు సంతోషంగా ఉన్నారా?  ఆయన ఆత్మ శాంతితో ఉందా?  నిస్సందేహంగా.  ఇది మనకు తెలియజేసేది…

ధ్యానం 281: దేవుని అచంచలమైన చిత్తం

కొన్నిసార్లు, మనం దేవుణ్ణి గాఢంగా ప్రేమిస్తున్నప్పుడు, ఆయన కోసం గొప్ప కార్యాలు చేయాలనే బలమైన ప్రేరణలు మనలో కలుగుతుండవచ్చు. అయినప్పటికీ, మనకు కోరిక, దృఢసంకల్పం ఉన్నా, మన పని ముందుకు సాగడానికి దేవుడు అనుమతించడం లేదనిపించవచ్చు. దీనికి కారణం ప్రభువు…

ధ్యానం 270: దేవుని చిత్తంలోని సూక్ష్మ వివరాలు

మీ జీవితంలో దేవుని చిత్తాన్ని అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అలా అయితే, అందులోని ప్రతి చిన్న విషయాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. దేవుని చిత్తం అనేది ఏదో గొప్పగా వినిపించే సాధారణ భావన కాదు. ఆయన చిత్తాన్ని ఎంచుకోవడం అంటే, ఆయనను అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు కేవలం స్థూలంగా చెప్పడం కాదు. దానికి బదులుగా, ఆయన చిత్తాన్ని ఎంచుకోవడం అంటే…

ధ్యానం 267: న్యాయమా, కరుణా?

దేవుని న్యాయం గురించీ, ఆయన కరుణ గురించీ మాట్లాడటం సముచితమే.  అవి ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు.  దేవునికి సేవ చేయడానికి నిరాకరించిన దూతలపై ఆయన న్యాయతీర్పు అమలైనట్లే, పశ్చాత్తాపపడటానికి నిరాకరించేవారిపై కూడా అది అమలవుతుంది.  అయితే, ప్రస్తుతానికి దేవుడు కరుణామయుడు అని చెప్పడమే మరింత సముచితం.  నిజానికి…

ధ్యానం 266: పరిశుద్ధత సాధనలో నిరుత్సాహం

మీరు పరిశుద్ధులుగా మారాలని కోరుకుంటున్నారా? మీ సమాధానం “అవును” అని ఆశిస్తున్నాను. అయితే ఈ ప్రశ్న సంగతి ఏమిటి: మీరు పరిశుద్ధులుగా మారగలరని అనుకుంటున్నారా? దీనికి సమాధానం చెప్పడం మరింత కష్టంగా ఉండవచ్చు. పరిశుద్ధత గురించి కలలు కనడం, దానిని కోరుకోవడం సులభమే…