తెలుగు

ధ్యానం 264: యేసుతో ఆధ్యాత్మిక ఏకాంత సాధన

మీరు ఎప్పుడైనా ఆధ్యాత్మిక ఏకాంత సాధన చేశారా?  జీవితపు తీరికలేనితనం నుంచి కొంతకాలం దూరంగా ఉండి, మన ప్రభువు మాటలను ఆలకిస్తూ, ఆయన కారుణ్యమయ సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే అవకాశం కొందరికి లభిస్తుంది.  మరికొందరికి అలాంటి సాధన కోసం ఒక్క రోజు కేటాయించడం కూడా కష్టమవుతుంది.  ఏదేమైనా…

ధ్యానం 263: తుపానులో మీ నావకు చుక్కాని పట్టే దేవుడు

మీరు చిన్నపిల్లగా సముద్రం మధ్యలో ఒక చిన్న పడవలో ఉన్నట్లు ఊహించుకోండి. తుపాను మొదలవుతుంది; ఏ దిశలోనూ మీకు తీరం కనిపించదు. అలలు విరుచుకుపడిన ప్రతిసారీ పడవ ముందుభాగాన్ని ముంచెత్తుతుంటే, వాటి తాకిడికి మీరు అటూ ఇటూ కొట్టుకుపోతూ, ప్రాణాలతో ఎలా బయటపడతారో అనుకుంటారు. ఇప్పుడు మీ నాన్నగారు…

ధ్యానం 257: దేవుని దీర్ఘకాల ప్రణాళిక

మీరు పూర్ణహృదయంతో మన ప్రభువును సేవించడానికి ప్రయత్నించినప్పుడు, ప్రతిరోజూ తన చిత్తం గురించి ఆయన మీతో మాట్లాడుతున్నట్లు మీరు గ్రహించవచ్చు. అది పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, మీరు ఇది లేదా అది చేయాలని ఆయన కోరుతున్నట్లు మీకు అనిపించవచ్చు. సాధారణంగా దేవుడు మీ జీవితం కోసం తనకున్న ప్రణాళికనంతటినీ మీ ముందు అంతా…

ధ్యానం 235: కారుణ్యానికి సరళమైన పిలుపు

మన విశ్వాసంలో మరింత లోతుగా ఎదుగుతున్న కొద్దీ, జీవితం మరింత సంక్లిష్టమవుతుందని తేలికగా భావించవచ్చు. ఉదాహరణకు, గణితశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు, నేర్చుకునే ప్రతి కోర్సు అంతకుముందు నేర్చుకున్నదాని ఆధారంగా ముందుకు సాగుతుంది…

ధ్యానం 228: ఎన్నడూ వీడని దేవుని సాన్నిధ్యం

మీ జీవితంలో దేవుడు సజీవంగా ఉన్నారా?  ఆయన మీలో నివసిస్తున్నారా?  రాత్రింబగళ్లు మీ హృదయాంతరాళంలో ఆయన మీకు సన్నిహితంగా ఉన్నారా?  దేవుడు మిమ్మల్ని విడిచి వెళ్లేలా చేసేది ఒక్కటే ఉంది; అదే ఘోరపాపం…

ధ్యానం 227: మానవ ప్రణాళికలు భగ్నమవుతాయి

మన జీవితాల కోసం, దేవుని మహిమ కోసం మనం గొప్పదని భావించే ఒక ప్రణాళికను రూపొందించుకోవడం మనకు సులభమే. మనం ఆలోచించి, ప్రణాళికలు వేసి, వాటిని అభివృద్ధి చేసి, ఒక నిర్దిష్ట పద్ధతిలో అన్నింటినీ ఏర్పాటు చేసుకున్న తరువాత, మనం రూపొందించుకున్నది దేవుని మనసులో ఉన్నది కాదని తెలుసుకోవచ్చు…

ధ్యానం 224: మాట్లాడాలా, మౌనంగా ఉండాలా

అతిగా మాట్లాడటం, ఇతరులకు మన గురించి వివరణ ఇచ్చుకోవడం, ముఖ్యంగా మన చర్యలు సమర్థనీయమైనవని వారు భావించేలా చేయడం—ఇది మనుషుల్లో సాధారణంగా కనిపించే ఒక ధోరణి.  ఇతరులు మనల్ని అపార్థం చేసుకుంటున్నారని అనిపించినప్పుడు ఈ ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తుంది.  అయితే యేసు దీనిని అత్యధిక స్థాయిలో అనుభవించాడు…

ధ్యానం 219: కరుణను ప్రకటించడంలో కష్టాలు

మీ జీవితంలో దేవుని కరుణను సంపూర్ణంగా స్వీకరించాలని మీరు దృఢంగా సంకల్పిస్తే, మీ ఊహలకందని రీతిలో మీరు రూపాంతరం చెందుతారు.  అయితే, మీకు మరో అనుభవం కూడా ఎదురవుతుంది.  పతనమైన లోకంలో కరుణతో జీవించడానికి, కరుణను ప్రకటించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో గొప్ప కష్టాలు ఎదురవుతాయి.  లోకం దేవుని కరుణను అర్థం చేసుకోదు.  లోకానికి తెలిసినవి కఠినత్వం, తీర్పు చెప్పడం మాత్రమే.  అది ప్రతీకారాన్ని కోరుకుంటుంది, గౌరవిస్తుంది…

ధ్యానం 214: సంపూర్ణ క్షమాభిక్ష

మీరు ఒక తీవ్రమైన నేరం చేసి, జీవిత ఖైదు శిక్షను ఎదుర్కొంటున్నట్లు ఊహించుకోండి.  మీరు చేసిన దానికి పశ్చాత్తాపపడి, దానిని పూర్తిగా ఒప్పుకున్నారు.  మీకు శిక్ష విధించే రోజున, త్వరలోనే తిరిగి అక్కడికే వెళ్లవలసి ఉంటుందని తెలిసి, మిమ్మల్ని నిర్బంధించిన చోటు నుండి చేతులకు సంకెళ్లతో వచ్చారు.  అయితే, న్యాయమూర్తి…

ధ్యానం 213: అవగాహన అనే ఆధ్యాత్మిక వరం

దేవుని రహస్యాలు మీకు అర్థమవుతున్నాయా? మీరు మన సభ విశ్వాసాన్ని ఎన్నో సంవత్సరాలపాటు అధ్యయనం చేసిన వేదాంత పండితులని ఊహించుకోండి. మన సభకు చెందిన వేదాంత శాస్త్ర విభాగాలన్నిటి పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన, ఈ రహస్యాల గురించి మీలో తప్పనిసరిగా నిజమైన అవగాహన కలుగుతుందా…