తెలుగు

ధ్యానం 362: కారుణ్యంతో నిండిన రెండు హృదయాలు

యేసు హృదయం సంపూర్ణ కారుణ్యమే. అది లోకంపై ధారాళంగా ప్రవహించే కృపకు ఊట. ఇది ఓదార్పునిస్తుంది. అయితే కారుణ్యపు ఊటగా మారవలసిన మరో హృదయం కూడా ఉంది; అదే మీ హృదయం. మీరు ప్రభువు కారుణ్యంలో ఎంతగా లీనమవ్వాలంటే, మీ హృదయం…

ధ్యానం 361: త్యాగం మరియు ప్రార్థన

దీనిని అర్థం చేసుకోవడం, నమ్మడం కష్టంగా అనిపించినప్పటికీ, స్వచ్ఛమైన ప్రార్థనతో ఏకమైన ఆంతరంగిక త్యాగం ప్రపంచమంతటా సువార్త ప్రకటనకు అపారమైన మేలు చేస్తుంది. వాస్తవానికి, ప్రతిరోజూ ఆంతరంగిక త్యాగాలను సమర్పించే పుణ్యాత్ముల శక్తి సువార్త ప్రచారకులకు లేకపోతే…

ధ్యానం 360: ఆధ్యాత్మిక పోరాటం

ప్రలోభపెట్టే సాతాను నిజంగానే ఉన్నాడు, కానీ అతనికి భయపడవలసిన అవసరం లేదు. మీరు అతనిని ఏమాత్రం పట్టించుకోకూడదు. అతని ఆలోచనలతో తలపడకూడదు. అతనితో బేరమాడకూడదు. ప్రలోభాలు ఎదురైనప్పుడు మీలో ధైర్యం, దేవుని కారుణ్యంపై నమ్మకం, నిరీక్షణ ఉండాలి. మారిపోకండి…

ధ్యానం 357: కృప ప్రేరణలు

ఎవరైనా కలతతో ఉన్నప్పుడు, మీరు వారికి దూరంగా ఉండవచ్చు.  వారితో మాట్లాడితే మీ సమయంపైనా శక్తిపైనా పెద్ద భారం పడుతుందని అనుకోవడం సులభమే.  కానీ మీ సంభాషణను నడిపించేది ప్రభువే అయితే, ఆయన కొద్దిసేపటిలోనే అద్భుతమైన కార్యాలు చేయగలడు.  నిజమే, కొన్ని సందర్భాల్లో…

ధ్యానం 345: దేవునిలో మునిగిపోవడం

మీరు ఎప్పుడైనా దేవునిలో పూర్తిగా లీనమవుతారా?  చాలామందికి ఇది అరుదైన అనుభవం; మరికొందరికి అసలు అనుభవంలోకి రానిది.  దేవునిలో లీనమవడం లేదా మునిగిపోవడం అంటే, ఆయన సన్నిధిలో మిమ్మల్ని మీరు మరచిపోయినట్లు అనిపించేంత గాఢంగా ప్రార్థనలో నిమగ్నమవడం.  ఇలా జరిగినప్పుడు, ప్రభువు మిమ్మల్ని పూర్తిగా తన వశం చేసుకుంటారు…

ధ్యానం 340: పరీక్షకు గురికావడం

పరీక్షకు గురికావడం వెంటనే సంతోషాన్ని కలిగించకపోవచ్చు; అయినా కొన్నిసార్లు దానివల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభువు దీనిని అనేక విధాలుగా అనుమతిస్తారు. పరీక్షకు గురికావడం ప్రలోభం కాదు; బదులుగా, తన పవిత్ర చిత్తానికి మరింత లోతుగా లోబడమని మనలను ఆహ్వానించేందుకు ప్రభువు మనలను ఒక కష్టపరీక్షను ఎదుర్కోనిచ్చే మార్గం అది. ఎప్పుడైతే…

ధ్యానం 337: ఇతరుల ఆందోళనను తగ్గించడంలో సహాయం

మన జీవితంలో అప్పుడప్పుడు కలవరపడుతున్న, మనస్తాపంతో ఉన్న లేదా చింతిస్తున్న వ్యక్తులు మనకు ఎదురవడం దాదాపు ఖాయం. వారు ఏదో ఒక విషయం గురించే అతిగా ఆలోచిస్తూ ఉండవచ్చు; వారి ఆలోచన కొంతవరకు హేతువిరుద్ధంగా కూడా ఉండవచ్చు. కారుణ్యం చూపడానికి ఇది ఎంత కృపాపూరితమైన అవకాశం! ఆందోళన…

ధ్యానం 335: నిరంతరం క్షమించడం 

మిమ్మల్ని హింసించేవారి కోసం ప్రార్థించడం, వారితో అత్యంత గౌరవంతోను కనికరంతోను వ్యవహరించడం జీవితంలో అత్యంత కష్టమైన పనులలో ఒకటి. అయితే వారిని ద్వేషించడం వల్ల గానీ, వారిపై విరుచుకుపడటం వల్ల గానీ ప్రయోజనం ఏమిటి? వారికి ఈ విధంగా “హాని” చేయడం వల్ల వారి ఆత్మకన్నా మీ ఆత్మకే ఎంతో ఎక్కువ నష్టం కలుగుతుంది. క్షమించండి…

ధ్యానం 333: సరళత

కొన్నిసార్లు జీవితం సంక్లిష్టంగా కనిపించవచ్చు; మనం కూడా అలాగే కనిపించవచ్చు.  అయితే సత్యమేమిటంటే, మనం జీవిత సంక్లిష్టతలను దాటి చూసి, దేవుని దృష్టిలోనూ ఆయన చిత్తం ప్రకారమూ జీవితం సరళమైనదని గ్రహించాలి.  మనం చేయవలసిందల్లా ప్రతిరోజూ ఆయనకు “అవును” అని చెప్పడం, సమస్తాన్నీ ఆయనకు సమర్పించడం, నమ్మకం ఉంచడం…