తెలుగు

ధ్యానం 91: మరొకరి కోసం చేసే ప్రార్థన తలుపు తెరుస్తుంది

ప్రార్థనలో పునీత పేతురు — మథియాస్ స్టోమ్

వీడియో

ఆంగ్లంలో వినండి

మరొకరికి నిజంగా ఏమి అవసరమో దేవునికి మాత్రమే తెలుసు.  దేవుడు మనకు ఈ ప్రత్యేక కృపను ఇస్తే తప్ప, మరొకరి ఆత్మలో ఏముందో మనం తెలుసుకోలేము.  అయితే ఇతరుల కోసం మనసారా ప్రార్థించడానికి మనలో ప్రతి ఒక్కరికీ పిలుపు ఉంది.  కొన్నిసార్లు, మన హృదయాలు తెరిచి ఉంటే, మరొకరి కోసం మనసారా ప్రార్థించవలసిన అవసరాన్ని దేవుడు మన హృదయాల్లో ఉంచుతారు.  మరొకరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించమనే పిలుపు మనకు కలిగితే, ఆ వ్యక్తికి ఎంతో అవసరమైన పవిత్రమైన, హృదయపూర్వకమైన సంభాషణకు దేవుడు అకస్మాత్తుగా తలుపు తెరవడం చూసి మనం ఆశ్చర్యపోవచ్చు (చూడండి డైరీ #396).

దేవుడు ఎవరినైనా మీ హృదయంలో ఉంచారా?  ఒక నిర్దిష్ట వ్యక్తి మీకు తరచూ గుర్తుకు వస్తున్నారా?  అలా అయితే, ఆ వ్యక్తి కోసం ప్రార్థించండి. ఆ వ్యక్తికి తోడుగా ఉండటం దేవుని చిత్తమైతే, అందుకు మీరు సిద్ధంగా, ఇష్టపూర్వకంగా ఉన్నారని ఆయనకు చెప్పండి.  ఆ తరువాత వేచి ఉండండి, ఇంకా ప్రార్థించండి.  దేవుడు అలా కోరుకుంటే, సరైన సమయంలో, సరైన చోట, ఆ వ్యక్తికి తోడుగా ఉండాలనే మీ సంసిద్ధత నిత్యత్వానికి సంబంధించిన మార్పును తీసుకురాగలదని మీరు గ్రహిస్తారు.

ప్రభువా, ప్రార్థనలో ఉత్సాహంతో నిండిన హృదయాన్ని నాకు దయచేయి.  నీవు నా దారిలో ఉంచే వ్యక్తులను స్వీకరించడానికి నాకు సహాయం చేయి.  అవసరంలో ఉన్నవారి కోసం నేను ప్రార్థిస్తూ, నీ చిత్తానుసారం నన్ను ఉపయోగించుకునేందుకు నీకు అందుబాటులో ఉంచుకుంటున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ముప్పై ఏడవ రోజు ధ్యానాలు:
ఎడారిలో 40 రోజులు & సిలువ చెంత 40 రోజులు

పాస్కా కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు