తెలుగు

ధ్యానం 254: దైవీకరణ

మన జీవితపు పిలుపును దైవీకరణకు పిలుపుగా వర్ణించవచ్చు.  దీని అర్థమేమిటి?  మనలను తన జీవితంలోకే ఆకర్షించడానికి దేవుడు భూమిపైకి వచ్చి, మన మానవ స్వభావాన్ని స్వీకరించారని దీని అర్థం.  ఒక విధంగా చెప్పాలంటే, మనం దేవునిగా మారడానికి పిలువబడ్డాము.  ఈ “దైవీకరణ” అనే భావన…

ధ్యానం 199: యేసుతో ఐక్యత అంటే ఇతరులతో ఐక్యత

కతోలిక సభ అనేక కారణాల వల్ల మహిమాన్వితమైనది. సభలో కనిపించే ఐక్యత దానిలోని ఒక మహిమాన్వితమైన అంశం. కొన్నిసార్లు సభలో అంతర్గతంగా ఎంతో అనైక్యత, మనోవేదన, అన్ని రకాల అవ్యవస్థలు ఉంటాయన్నది నిజం. అయితే ఇవి కతోలిక సభ లక్షణాలు కావు. ఇవి పాపాల ప్రభావాలు…

ధ్యానం 186: దేవునిచే భేదింపబడటం

దేవుడు మీ ఆత్మను “పూర్తిగా భేదించారా”? ఆయన మీలో “సర్వత్రా వ్యాపించి” ఉన్నారా? ఆయన దైవత్వంలో “కరిగిపోవడానికి”, ఆయన కారుణ్యం మిమ్మల్ని “ఆవరించడానికి” మీరు అనుమతిస్తున్నారా? దేవునితో మన సంబంధాన్ని వర్ణించడానికి మనం ఎన్నో మాటలు ఉపయోగించవచ్చు. దేవుడు ఎవరో, ఏమి… అనే విషయాలను వ్యక్తపరచడానికి అవన్నీ తోడ్పడినప్పటికీ…

ధ్యానం 180: యేసు శ్రమలు

సువార్తలతో పరిచయమున్న మనలో కొన్నిసార్లు క్రీస్తు శ్రమల పట్ల ఒక రకమైన ఉదాసీనత కలగవచ్చు. ప్రతి సంవత్సరం ఆ వృత్తాంతం చదువుతుంటే మనం వింటాము; ఆయన శ్రమలను చూపించే ఎన్నో చిత్రాలను చూశాము. ఇలా సుపరిచితమైపోవడం వల్ల, అది మనపై తగిన ప్రభావం చూపేందుకు మనం అవకాశం ఇవ్వకపోవచ్చు…

ధ్యానం 177:  పవిత్ర విధేయత

దేవుని చిత్తానికి బదులుగా మన సొంత చిత్తాన్ని నెరవేర్చకుండా మనల్ని కాపాడే అత్యంత గొప్ప సాధనాల్లో పవిత్ర విధేయత ఒకటి.  సన్యాస జీవితంలో ఉన్నవారికి దీనిని అక్షరార్థంగానూ, బాహ్య ఆచరణలోనూ జీవించే అనుగ్రహం లభించింది. ఆ బాహ్య ఆచరణను అంతరంగంలో ఇముడ్చుకోవడం ద్వారా, తాము జీవిస్తున్నది…

ధ్యానం 173: ఒకరితో ఐక్యత అంటే ముగ్గురితో ఐక్యత

పరమ పవిత్ర త్రిత్వానికి ఒకే దైవస్వభావం ఉన్నప్పటికీ, ముగ్గురు విభిన్న దైవవ్యక్తులుగా ఉంటారని వర్ణిస్తారు.  అందువల్ల ఆ ముగ్గురు విభిన్న దైవవ్యక్తులు పరిపూర్ణ ఐక్యతలో పాలుపంచుకుంటారు.  నిజానికి, వారు ఒకరికొకరు భిన్నంగా లేకపోతే “ఐక్యంగా” ఉండలేరు.  కాబట్టి ఇలా మాట్లాడటం అవసరం…

ధ్యానం 167: ప్రభువును అత్యంత గాఢంగా కోరుకోవడం

మీరు ప్రార్థించినప్పుడు, సుదీర్ఘంగా, పట్టుదలతో ప్రార్థించినప్పుడు, ప్రభువు మీ అంతరంగంలోకి ప్రవేశిస్తారు. ఆయన మీతో ఆత్మీయంగా సంభాషించి, తన హృదయాన్ని మీ హృదయంతో ఏకం చేస్తారు. దీని ఫలితాలను మీరు అనేక విధాలుగా అనుభవిస్తారు. సాధారణంగా కలిగే ఒక ఫలితం ఏమిటంటే, మీరు క్రీస్తుతో ఐక్యతలోకి ఎంత దగ్గరగా ఆకర్షితులైతే, అంతగా…

ధ్యానం 166: క్రీస్తుతో మీ ఐక్యతలోని శక్తి

మీకు సర్వశక్తులూ ఉన్నట్లు, లేదా సర్వశక్తిమంతునికి ఆత్మీయ మిత్రులుగా ఉన్నట్లు ఊహించుకోండి. ఐదవ శతాబ్దంలో జీవించిన పోప్ పునీత మొదటి లియో గురించి దేవుని శక్తిని వెల్లడించే ఒక కథ ఉంది. హూణుడైన అట్టిలా, అతని క్రూరమైన సైన్యం రోమును దోచుకోవడానికి ప్రయత్నించారని చెబుతారు. పోప్ పునీత లియో…

ధ్యానం 151: ఆధ్యాత్మిక బాంధవ్యం

మరొకరికి నిజంగా సన్నిహితంగా ఉండటానికి, వారిని లోతుగా అర్థం చేసుకోవడానికి, నిరంతరం మాట్లాడుతూ మీ మనసులోని, హృదయంలోని ప్రతి విషయాన్నీ పంచుకోవడం అవసరమా?  ఆ రెండు ఆత్మలూ దేవునితో గాఢంగా ఐక్యమై ఉంటే, అవసరం లేదు.  అప్పుడు, తాము పంచుకునే ఒకే విధమైన…

ధ్యానం 90: అందరితో ఐక్యత

ఒకరితో ఒకరం ఐక్యంగా ఉండటానికే మనం సృష్టించబడ్డాం. ఐక్యత లోపించినప్పుడు, దాని ప్రభావాలు కుటుంబాలలో, సమాజాలలో, దేశాల మధ్య కనిపిస్తాయి. అన్నిటికంటే ఎక్కువగా మనలను ఐక్యపరచేది ఏమిటి? మొట్టమొదటిగా, మనం ఇతర ఆత్మలతో ఐక్యమయ్యేది మన…