తెలుగు

ధ్యానం 269: కారుణ్యం, దైన్యం రెండింటిపైనా దృష్టి

దృష్టి నిలపడానికి మీరు రెండు విషయాలను ఎంచుకోగలిగితే, అవి ఏవై ఉంటాయి?  నిజానికి, దృష్టి నిలపవలసిన అత్యంత ముఖ్యమైన రెండు విషయాలు దేవుని కారుణ్యం, మీ సొంత దైన్యం.  దృష్టి నిలపవలసిన అత్యంత ముఖ్యమైన విషయాలలో దేవుని కారుణ్యం ఒకటని మీకు వెంటనే అర్థమవుతుంది…

ధ్యానం 268: మరణాన్ని గురించి ఆలోచించడం

బహుశా మీ మరణాన్ని గురించి ఆలోచించడం భయం కలిగించవచ్చు. వాస్తవానికి మీరు దాని గురించి తరచుగా ఆలోచించకపోవచ్చు. కానీ తన మరణాన్ని నేరుగా, సంపూర్ణ నమ్మకంతో చూడగలగడం ఒక అనుగ్రహం. మీ జీవితం సక్రమంగా ఉన్నప్పుడే సంపూర్ణ నమ్మకంతో అలా చేయడం సాధ్యమవుతుంది…

ధ్యానం 262: ప్రేమ పాలన లేదా న్యాయ పాలన

మనం దేవుని హస్తం నుండి తప్పించుకోలేము.  విశ్వాన్ని పోషిస్తూ, సమస్తాన్ని ఉనికిలో నిలిపి ఉంచేది ఆయనే.  ఆయన నిరంతర సంరక్షణ లేకపోతే మన ఉనికి అంతమైపోతుంది.  అయితే మనం రెండు విధానాల్లో ఏదో ఒక విధంగా ఆయన పరిరక్షణ హస్తం క్రింద ఉంటాము.  మనం “ప్రేమ పాలన” ద్వారా గానీ, “న్యాయ పాలన” ద్వారా గానీ నడిపించబడతాము.  ఆ…

ధ్యానం 261: ఇతరులలో మరుగై ఉన్న యేసు

యేసు పేదరికంలో, ఆకలితో, చలితో మీ వద్దకు వచ్చి, తన బాగోగులు చూసుకోమని మిమ్మల్ని అడిగితే ఎలా ఉంటుందో ఊహించండి. ఈ అనుభవం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసి, ఈ వ్యక్తి నిజంగా యేసేనా అని సందేహించేలా చేయవచ్చు. కానీ ఆయనే యేసు. అవసరంలో ఉన్న వ్యక్తి రూపంలో యేసు ప్రతిరోజూ మన వద్దకు వస్తారు. బహుశా…

ధ్యానం 259: వినయముగల ఆత్మ సౌందర్యం

ఒక వ్యక్తికి సౌందర్యాన్ని ఇచ్చేది ఏమిటి?  అన్నిటికంటే ఎక్కువగా అది వినయం అనే సద్గుణమే.  వినయం అసాధారణంగా ఆకర్షిస్తుంది.  వినయముగల ఆత్మ మొదట్లో కొందరిని అంతగా ఆకట్టుకోకపోవచ్చు. అయినా కాలక్రమేణా, అత్యంత అహంకారంతో, స్వార్థంతో నిండిన వ్యక్తిని సైతం వినయం తనవైపు ఆకర్షిస్తుంది.  అది…

ధ్యానం 258: దేవుని సాన్నిహిత్యం

దేవుడు ఎక్కడ ఉన్నారు?  దేవుడు పరలోకంలోనో, ఏదో సుదూర ప్రదేశంలోనో ఉండి, మనలను పైనుంచి చూస్తూ, తన పవిత్ర చిత్తానికి అనుగుణంగా సమస్త సృష్టిని నడిపిస్తున్నారని భావించడం సులభం.  ఇది నిజమే, కానీ ఇది పూర్తి చిత్రం కాదు.  దేవుడు మనకూ, సృష్టించబడిన లోకానికీ ఎంతో అతీతంగా ఉన్నారు కాబట్టి ఆయన పరిపూర్ణంగా “అతీతుడు.”  అయితే ఆయన…

ధ్యానం 249: బాధల ఫలం

ఎంతో బాధను అనుభవించిన తరువాతే, అటువంటి బాధల నుండి కలగగల మంచి ఫలాలను అర్థం చేసుకోవడం మొదలవుతుంది. బాధ అనేది స్వతహాగా పతనమైన మన మానవ స్థితి ఫలితం. అయితే యేసు మన మానవ స్థితిలోకి ప్రవేశించి, సమస్త బాధలనూ స్వీకరించి…

ధ్యానం 247: అవసరాల్లో ఉన్నవారి ద్వారా లభించే ఆశీర్వాదం

మీ కుటుంబంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో ఉన్నా, చెరసాలలో ఉన్నా, లేదా ఏదైనా తీవ్రమైన అవసరంలో ఉన్నా, అది మీకు భారంగా ఉంటుందా లేక ఆశీర్వాదంగా ఉంటుందా?  దీని గురించి ఆలోచించండి.  ప్రత్యేక అవసరాలు ఉన్నవారు మీ జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నారా?  పూర్తిగా ఆచరణాత్మక స్థాయిలో ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తే, ఆ…

ధ్యానం 246: దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించిన తరువాత

దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించిన తరువాత మీరు ఏమి చేస్తారు? మనసు ఎటో తిరుగుతుండగా, చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ, నిజమైన ఆధ్యాత్మిక స్థాయిలో మన ప్రభువును కలుసుకోకుండానే, పరధ్యానంతో మీ ఆసనానికి తిరిగి వెళ్తారా? లేక ఆ క్షణాన్ని నిజమైన ప్రార్థనకు, సహవాసానికి ఒక క్షణంగా మారనిస్తారా…

ధ్యానం 243: తాను ప్రేమించేవారికి యేసు ఇచ్చే ప్రత్యేక వరం

మీరు ప్రేమించే వారితో ఎలా వ్యవహరిస్తారు?  సాధారణంగా, మన కుటుంబ సభ్యులకు లేదా ఎంతో సన్నిహితులైన స్నేహితులకు ఏది అత్యుత్తమమో, ఏది వారికి సంతోషాన్ని ఇస్తుందో దానినే మనం కోరుకుంటాం.  దేవుడు కూడా మనలో ప్రతి ఒక్కరికీ అదే కోరుకుంటారు, కానీ దేవుడు దేనిని ఎలా చూస్తారో తెలిసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగవచ్చు…