తెలుగు

ధ్యానం 314: పటిష్ఠమైన రక్షణగా కారుణ్యం

చిత్ర సౌజన్యం: పిక్సాబే

వీడియో

ఆంగ్లంలో వినండి

ఒక సైన్యం ముట్టడికి గురైనప్పుడు, తనను తాను కాపాడుకోగల స్థలం కోసం వెదుకుతుంది. ఎత్తైన ప్రదేశాన్ని గానీ, ఆశ్రయాన్ని, రక్షణను ఇచ్చే స్థలాన్ని గానీ వెంటనే వెదుకుతుంది. మీ ఆధ్యాత్మిక జీవితంలోనూ ఇలాగే ఉండాలి. దుష్టుని బాణాలు మిమ్మల్ని తాకినప్పుడు, లేదా జీవితం మీకు భారమైనప్పుడు, ముఖ్యంగా మీ పాపం కారణంగా అలా అనిపించినప్పుడు, ఎత్తైన ప్రదేశాన్ని, అత్యంత గొప్ప ఆశ్రయస్థలాన్ని వెదకండి. ఆ స్థలమే మన ప్రభువు కారుణ్యమయ హృదయం. ఆయన హృదయం మీకు ఆశ్రయస్థలమనే విషయంలో సందేహించకండి. ఆయన హృదయంలో అలసట కలిగించే పోరాటం నుండి మీకు రక్షణ లభిస్తుంది; కారుణ్యమనే పటిష్ఠమైన దుర్గంలో మీరు ఉన్నారని తెలుసుకుంటారు. రక్షణ స్థలంగా ఉండటమనే కారుణ్యపు ఈ ప్రత్యేక అంశాన్ని అర్థం చేసుకొని స్వాగతించాలి. జీవితంలోని కష్టాలను మనంతట మనమే భరించలేము. మన సొంత బలంపై, నైపుణ్యాలపై ఆధారపడితే జీవిత పోరాటాలు చేయలేము. ఉగ్రంగా విరుచుకుపడే శత్రువును ఎదుర్కొని తరిమికొట్టగల నైపుణ్యం ఎవరికీ లేదు. దేవుని కారుణ్యంలో ఆశ్రయం పొందండి; ఆయన మిమ్మల్ని సమస్త హాని నుండి కాపాడతారు (చూడండి దినచర్య #1516).

మీకు రక్షణ ఎంత అవసరమో ధ్యానించండి. ఈ లోకంలో ఒంటరిగా, మీ సొంత బలంతో మీరు ఎప్పటికీ నిలదొక్కుకోలేరు. ఈ లోకమంతటా వ్యాపించి ఉన్న శోధనలు, దాడులు, చెడు మిమ్మల్ని నాశనం చేస్తాయి. కానీ మీకు రక్షణనిచ్చే దుర్గం ఉంటే, ఏదీ మీకు హాని చేయదు. ఆ రక్షణే దేవుని కారుణ్యం. దేవుణ్ణి, ఆయన కారుణ్యాన్ని అటువంటి దుర్గంగా భావిస్తూ ఈ రోజు కొంత సమయం గడపండి. అన్ని విషయాలలోనూ ఆయనే మీ రక్షకుడని గుర్తించి, ఈ సురక్షిత స్థలానికి పరుగెత్తండి. ప్రభువు తన కృపతో మిమ్మల్ని ఆవరించి, తన హృదయమనే నివాసంలో మిమ్మల్ని శాంతితో ఉంచుతారు.

ప్రభువా, లోకపు భారం, దాడులు, శోధనలు నాపై పడుతున్నట్లు నాకు అనిపించినప్పుడు, ఆశ్రయం వెదికే జ్ఞానాన్ని నాకు దయచేయి. నేను నీ వద్దకు పరుగెత్తి వచ్చి, నీ కారుణ్యమయ హృదయంలో దాగి ఉండేలా చేయి. నీ పరిపూర్ణ రక్షణను నేను ఎన్నడూ సందేహించకుండా, ఎల్లప్పుడూ నీలో ఆశ్రయం పొందేలా చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

నవంబర్ 10 – పోపుగారు, సభ పండితుడు అయిన మహా పునీత లియో స్మరణ దినం


దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు