తెలుగు

ధ్యానం 202: ఒక దైనందిన వార్షికోత్సవం

వార్షికోత్సవాలు ధ్యానానికీ కృతజ్ఞతకూ లభించే ఆశీర్వాదకరమైన అవకాశాలు. సుదీర్ఘమైన, పవిత్రమైన దాంపత్య జీవితాన్ని జరుపుకునే దంపతుల వివాహ వార్షికోత్సవం వంటి కొన్ని వార్షికోత్సవాలు ఆనందకరమైనవి. ప్రియమైన వ్యక్తి మరణించిన రోజు వంటి ఇతర వార్షిక జ్ఞాపకదినాలు బాధాకరమైనవి. అయినప్పటికీ…

మరింత చదవండి

ధ్యానం 201: చెరసాలలో యేసుతో ఆ రాత్రి

ఏదో విధంగా ఆధ్యాత్మిక రహస్యానుభవం ద్వారా పవిత్ర గురువారం రాత్రికి మీరు తీసుకెళ్లబడితే ఎలా ఉంటుందో ఊహించండి. యేసు అనుభవించిన సమస్తాన్ని ఏదో విధంగా మీరు చూడగలిగి, అనుభవించగలిగితే ఎలా ఉంటుందో ఊహించండి. తోటలోని వేదనను, ఎగతాళిని, కఠినమైన ప్రవర్తనను ఊహించండి…

మరింత చదవండి

ధ్యానం 200: ప్రేమ, బాధల ఏకత్వం

ప్రేమ, బాధ ఒకదానికొకటి విరుద్ధమైనవా?  మరో మాటలో చెప్పాలంటే, మీరు ఎంతో బాధను అనుభవిస్తున్నా మీలో గొప్ప ప్రేమ కూడా ఉండగలదా?  ఆలోచించవలసిన ఒక ప్రశ్న ఇది: మీ బాధకు మూలం ఏమిటి?  అది మీ పాపమా?  అది మరొకరిపట్ల కనికరమా?  అది శారీరకమైన లేదా మానసికమైన…

మరింత చదవండి

ధ్యానం 199: యేసుతో ఐక్యత అంటే ఇతరులతో ఐక్యత

కతోలిక సభ అనేక కారణాల వల్ల మహిమాన్వితమైనది. సభలో కనిపించే ఐక్యత దానిలోని ఒక మహిమాన్వితమైన అంశం. కొన్నిసార్లు సభలో అంతర్గతంగా ఎంతో అనైక్యత, మనోవేదన, అన్ని రకాల అవ్యవస్థలు ఉంటాయన్నది నిజం. అయితే ఇవి కతోలిక సభ లక్షణాలు కావు. ఇవి పాపాల ప్రభావాలు…

మరింత చదవండి

ధ్యానం 198: నిజమైన సహానుభూతిలోని కారుణ్యం

హృదయపూర్వకమైన నిజమైన సహానుభూతి లోపించడం అనేది ఒక రకమైన మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక రుగ్మతకు కూడా స్పష్టమైన సంకేతం. దీనికి విరుద్ధమైనది కూడా నిజమే కాబట్టి ఈ విషయం ప్రస్తావించబడుతోంది. హృదయపూర్వకమైన నిజమైన సహానుభూతి ఉండటం అనేది ఒక వ్యక్తి మానసికంగా, భావోద్వేగపరంగా…

మరింత చదవండి

ధ్యానం 197: నాకు దాహంగా ఉంది

“నాకు దాహంగా ఉంది.”  ఈ రెండు సరళమైన మాటల్లో ఎంతో అర్థం ఉంది.  మన ప్రభువు సిలువపై నుండి ఈ మాటలు పలికారు.  ఆయన దాహాన్ని తీర్చి కొంత ఉపశమనం కలిగించాలని ఒక సైనికుడు ద్రాక్షారసపు పులుసులో ముంచిన స్పాంజిని ఆయనకు అందించాడు.  పులుసుగా మారిన ద్రాక్షారసం, మారిపోయిన ఆత్మకు ప్రతీక…

మరింత చదవండి

ధ్యానం 196: ఇతరులలో యేసును ప్రేమించడం

“నా సోదరులలో అత్యల్పులైనవారికి మీరు ఏది చేసినా, అది నాకే చేస్తున్నారు” (మత్తయి 25:40) అనే సువార్త వాక్యం మనకు బాగా పరిచయమే. అయితే మీరు దీనిని నమ్ముతున్నారా? నమ్మితే, యేసును ప్రేమించడం సులభమని, అలా చేయడానికి మీకు ఎల్లప్పుడూ అవకాశం ఉందని మీరు తెలుసుకుంటారు…

మరింత చదవండి

ధ్యానం 195: మన మధురానందం

ద్రాక్షారసాన్ని రుచిచూసి దాని నాణ్యతను గుర్తించడంలో మీరు నిపుణులై ఉండి, ఒక సీసా శ్రేష్ఠమైన ద్రాక్షారసానికీ ఒక సీసా చవకబారు ద్రాక్షారసానికీ మధ్య ఎంచుకోవాల్సి వస్తే, సహజంగానే మీరు శ్రేష్ఠమైనదానినే ఎంచుకుంటారు.  మీకు వాటి మధ్య తేడా తెలుస్తుంది; చవకబారు ద్రాక్షారసంలో మీకు అంతగా ఆనందం కలగదు, ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది…

మరింత చదవండి

ధ్యానం 194: జీవితంలో సంతృప్తి

జీవితంలో మీకు సంతృప్తినిచ్చేది ఏమిటి?  ఈ ప్రశ్నకు సమాధానాలు వ్యక్తిని బట్టి ఎంతో భిన్నంగా ఉండవచ్చు.  ఒకరికి పనిలో, మరొకరికి కుటుంబ కార్యకలాపాల్లో, ఇంకొకరికి సమాజ సేవలో, మరొకరికి సంపదలోనూ లౌకిక ప్రతిఫలాల్లోనూ సంతృప్తి లభించవచ్చు.  అనేక రకాలైన…

మరింత చదవండి

ధ్యానం 193: వెనుకాడకండి

మీరు పది లక్షల డాలర్లు గెలుచుకుంటే, “వద్దు, నాకు కేవలం $100 ఇవ్వండి, నాకు కావలసింది అంతే” అని బహుశా అనరు.  అయినా దేవుని కారుణ్యం విషయంలో మనం తరచూ చేసేది అదే.  దేవుడు సమృద్ధిగా సంపదను అందిస్తుంటే, మనం మాత్రం అందులో కొద్దిభాగాన్నే తీసుకోవాలని ఎంచుకుంటాం.  ఎందుకలా?  ఆయన కారుణ్యానికి హద్దులు లేవు.  అది అనంతమైనది.  మనం…

మరింత చదవండి