తెలుగు

ధ్యానం 137: సిలువలోని శక్తి

మీరు ప్రార్థించేటప్పుడు, ఎప్పుడైనా కూర్చొని సిలువపై యేసు స్వరూపాన్ని తదేకంగా చూస్తారా? బయటి దృష్టితో చూస్తే, సిలువపై యేసు స్వరూపం అర్థంకాని ఒక వాస్తవం. అంత భయానకమైన సంఘటనను మనం ఎందుకు ఉన్నతంగా ఎత్తిచూపి గౌరవిస్తాం? దేవుని కుమారుని క్రూరమైన హత్య మొదట్లో మనలను ఆకర్షించే విషయం కాకపోవచ్చు. అయినా…

ధ్యానం 130: ఇతరులను ప్రేమతో సరిదిద్దడం

మనలో ప్రతి ఒక్కరికీ అప్పుడప్పుడు ఇతరుల పాపం ఎదురవుతుందనడంలో సందేహం లేదు. అది వారి మాటల్లోనో, పనుల్లోనో, చేయవలసినది చేయకపోవడంలోనో ఉండవచ్చు. పాపం బాధపెడుతుంది; దానిని సరిదిద్దవలసిన అవసరం ఉంది. చాలా తరచుగా, ఇతరులు మనకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మనకు కోపం వస్తుంది. కానీ…

ధ్యానం 126: బిడ్డకు సహజమైన భయం – మేలైన భయం

మీ జీవితంలో భయం ఉందా? కొన్ని రకాల భయం ఒక విధమైన గర్వం నుంచి పుట్టి ఎంతో హానికరంగా ఉంటాయని, మరొక రకమైన భయం దేవునిపట్ల మీకున్న గాఢమైన ప్రేమ నుంచి కలిగి ఎంతో మేలు చేస్తుందని తెలుసుకోవడం ముఖ్యం. “పవిత్రమైన భయం” అంటే బిడ్డకు సహజమైన భయం, అనగా దేవుని బిడ్డకు ఉండే భయం. ఈ…

ధ్యానం 124: మధ్యస్థ ప్రార్థన ద్వారా లభించే కారుణ్యం

దేవుని దైవకారుణ్యం లోకంపై సమృద్ధిగా ప్రవహించడాన్ని మీరు చూడాలనుకుంటున్నారా?  ఆ ప్రశ్నకు మీరు తడుముకోకుండా “అవును” అని జవాబిస్తారని ఆశిస్తున్నాము, భావిస్తున్నాము.  అది జరుగుతుందా లేదా అనే విషయంలో కొంతవరకు మీకూ బాధ్యత ఉందని తెలుసుకోవడం ముఖ్యం.  ప్రత్యేకంగా, యేసు…

ధ్యానం 123: అవమానాల ఆశీర్వాదం

సరైన ఆలోచన ఉన్నవారెవరైనా అవమానానికి గురికావాలని కోరుకుంటారా?  మీరు అవమానానికి గురైతే ఏమి చేస్తారు?  చాలామందికి అవమానాన్ని తప్పించుకునే మార్గాలను వెదకాలనిపిస్తుంది. దానివల్ల కొందరు తీవ్రంగా బాధపడతారు.  మరికొందరు కోపంతో తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు.  అయితే…

ధ్యానం 119: అంతరంగ, బాహ్య ఆత్మనిగ్రహ సాధనలు

ఈ లోకంలోని గతించిపోయే విషయాలపట్ల మరింత అనాసక్తిని పెంపొందించుకోవడానికి స్వీయ సంకల్పాన్ని నిరాకరించే సాధనే ఆత్మనిగ్రహం.  దేవునిపట్ల, ఆయన పవిత్ర చిత్తంపట్ల తప్ప మరి దేనిపట్లా మమకారం లేకుండా ఉండటానికి మనం కృషి చేయాలి.  మనకు నచ్చినవన్నీ లేదా మనం కోరుకునేవన్నీ చెడ్డవని కాదు; అయితే మనం నిజమైన పవిత్రతను కోరుకుంటే, మన…

ధ్యానం 118: మొండిపట్టుగల హృదయం

దేవుని కారుణ్యం మన జీవితాల్లోకి ప్రవేశించకుండా మనం అడ్డుకునే ప్రధాన మార్గాల్లో ఒకటి మన మొండితనం.  ముఖ్యంగా, మన గర్వం కారణంగా మన సొంత అభిప్రాయాన్నే మొండిగా పట్టుకొని, సత్యాన్ని స్వీకరించడానికి మనసు తెరవనప్పుడు, మనం అనుగ్రహానికి తలుపు మూసివేస్తాము.  ఇది…

ధ్యానం 111: దుష్టుని అబద్ధాలు

సాతాను మనల్ని అనేక విధాలుగా శోధిస్తాడు. మనం పాపసంకీర్తనలో ఒప్పుకున్న పాపాలతో సహా మన పాపాలను మనకు గుర్తుచేయడం, మనపై దాడి చేయడానికి సాతాను తరచుగా ఇష్టపడే ఒక మార్గం. మనం తప్పుడు మార్గంలో ఉన్నామని, దేవునికి ప్రీతిపాత్రంగా లేమని, మనం అబద్ధాలు చెప్పేవారమని, పాపులమని మనల్ని నమ్మించడానికి ప్రయత్నించడంలో అతడు ఆనందిస్తాడు. ఇంకా…

ధ్యానం 110: కారుణ్య కిరణాలు

యేసు హృదయ కారుణ్యం గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తుంది. పునీత ఫౌస్టీనా దర్శించిన దైవకారుణ్య చిత్రరూపం ఇదే. తెరచి ఉన్న మన ప్రభువు హృదయం నుండి లోకంపై వెలుగు, కృప ఉప్పొంగి ప్రవహించాయి. లోకంపై తన వెలుగును ప్రసరింపజేస్తూనే ఉండాలని యేసు కోరుకుంటున్నారు…

ధ్యానం 107: పాపసంకీర్తనంలో మీ ఆత్మను వెల్లడించడం

దేవుడు తన యాజకుల ద్వారా తన ప్రతినిధులను మన వద్దకు పంపుతారు.  యాజకులు పరిపూర్ణులు కాకపోయినా, వారు దేవుని ప్రతినిధులే.  సయోధ్య సంస్కారంలో ఇది ప్రత్యేకంగా నిజం.  మనం ఆ సంస్కారాన్ని సమీపించడం అత్యావశ్యకం…