తెలుగు

ధ్యానం 107: పాపసంకీర్తనంలో మీ ఆత్మను వెల్లడించడం

దేవుడు తన యాజకుల ద్వారా తన ప్రతినిధులను మన వద్దకు పంపుతారు.  యాజకులు పరిపూర్ణులు కాకపోయినా, వారు దేవుని ప్రతినిధులే.  సయోధ్య సంస్కారంలో ఇది ప్రత్యేకంగా నిజం.  మనం ఆ సంస్కారాన్ని సమీపించడం అత్యావశ్యకం…

ధ్యానం 102: దేవుడు బలహీనులను ఉపయోగించుకుంటారు

మీరే దేవుడై ఉండి, ఏదైనా మహిమాన్వితమైన కార్యాన్ని నెరవేర్చాలని కోరుకుంటే, ఎవరిని ఎంచుకుంటారు?  ప్రతిభాపాటవాలు స్పష్టంగా కనిపించే వ్యక్తినా?  లేక బలహీనంగా, వినయంగా ఉండి, సహజమైన ప్రతిభాపాటవాలు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపించే వ్యక్తినా?  ఆశ్చర్యకరంగా, దేవుడు చాలా తరచుగా బలహీనులనే ఎంచుకుంటారు, అతి గొప్ప కార్యాల కోసం…

ధ్యానం 99: పాపమనే కొరడా

యేసు అంతగా ఎందుకు బాధపడ్డారు?  ఆయన అంత తీవ్రమైన కొరడా దెబ్బలను ఎందుకు భరించారు?  ఆయన మరణం అంత బాధాకరంగా ఎందుకు ఉండింది?  ఎందుకంటే పాపానికి పర్యవసానాలు ఉంటాయి; అది తీవ్రమైన బాధకు మూలం.  అయితే యేసు స్వచ్ఛందంగా, ఏ పాపమూ లేకుండా బాధలను స్వీకరించడం ద్వారా రూపాంతరం చెందింది…

ధ్యానం 98: ఒక సాధనంగా ఉండటం

ఏదైనా కార్యాన్ని నెరవేర్చమని దేవుడు మనల్ని పిలిచినప్పుడు, పనిచేస్తున్నది ఎవరు?  దేవుడా, మనమా?  నిజానికి ఇద్దరమూ పనిచేస్తున్నాం; దేవుడు మూలం, మనం సాధనం.  మనం స్వేచ్ఛాసంకల్పంతో ప్రయత్నిస్తాం, కానీ మన ద్వారా ప్రకాశించేది దేవుడే.  ఒక కిటికీ వెలుగుకు మూలంగా పనిచేయగలిగినట్లే…

ధ్యానం 71: మన అల్పత్వం, శూన్యత

మనం ఉన్నదున్నట్లుగా మనల్ని మనం చూసుకోగలగడం దేవుని కృప.  మరి మనల్ని మనం ఇలా చూసుకుంటే ఏమి కనిపిస్తుంది?  మన దయనీయ స్థితి, శూన్యత కనిపిస్తాయి.  మొదట్లో ఇది అంత కోరదగినదిగా అనిపించకపోవచ్చు.  క్రీస్తులో మనకున్న గౌరవానికి ఇది విరుద్ధంగా కూడా అనిపించవచ్చు.  కానీ కీలకమైన విషయం అదే.  మన…

ధ్యానం 63: మీరు ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారు?

ఇతరులతో మాట్లాడేటప్పుడు, దేవుని ప్రేమ, కరుణ మన పెదవుల నుండి ప్రవహించాలి.  కానీ ఎలా?  మన మాటలు ఎలా ఉండాలి?  మనం దేవునితో ఎలా మాట్లాడాలో అనే వెలుగులో ఇతరులతో మనం మాట్లాడే తీరును పరిశీలించుకోవచ్చు.  దేవునితో మాట్లాడేటప్పుడు మనం నిజాయితీతో మాట్లాడాలి…

ధ్యానం 37: వినయం, సరళత, నిష్కాపట్యం

ఈ రోజు ధ్యానించడానికి మూడు పదాలు ఉన్నాయి: వినయం, సరళత, నిష్కాపట్యం.  వినయశీలమైన ఆత్మలు దేవుణ్ణి దర్శించి, తెలుసుకుంటాయి; ఎందుకంటే అవసరంలో ఉన్నప్పుడు అవి తమపైనే ఆధారపడవు.  దేవుడే సమస్తమని, ఆయన లేకుండా తాము ఏమీ కాదని అవి గుర్తిస్తాయి.  సరళమైన ఆత్మలు చిక్కుకుపోవు…

ధ్యానం 32: క్షమాపణలోని కారుణ్యం

జీవితమంతటా ఇతరుల పాపాల వల్ల మీరు గాయపడతారు. ఇది తప్పనిసరి. ఈ గాయాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారన్నదే నిజంగా ఆలోచించవలసిన ప్రశ్న. మీరు దానిని పట్టుకొని, పదేపదే తలచుకుంటూ కుమిలిపోతారా? లేక క్షమిస్తారా? అయితే క్షమించడం మాత్రమే సరిపోదు. దైవకారుణ్యం మీ ఆత్మలోకి ఎంతగా ప్రవేశించనివ్వాలంటే…

ధ్యానం 31: అవగాహనకు అందని దేవుని స్వభావం

దేవుని తత్త్వస్వరూపాన్ని మనం తెలుసుకోలేము. ఆయన మనకు అతీతుడు, మన అవగాహనకు అందనివాడు. అయితే మన జీవితాల్లోను, ప్రపంచంలోను ఆయన చేసే కార్యాలను చూడటం ద్వారా మనం దేవుణ్ణి తెలుసుకోవచ్చు. ఆయన గుణాలను చూడండి. ఆయన కార్యాలను చూడండి. మీ జీవితంలోను, ఇంకా…

ధ్యానం 30: దేవునికి విధేయత

పవిత్రతకు ఒక కీలక మార్గం విధేయత.  ఆదాము హవ్వలు అవిధేయత వల్ల అనుగ్రహ స్థితిని కోల్పోయారు; విధేయత ద్వారా మనం తిరిగి అనుగ్రహ స్థితిని పొందుతాము.  విధేయత కష్టంగా ఉండవచ్చు; దానికి హృదయాంతరాళంలో దృఢమైన నిర్ణయం అవసరం.  యేసుకు విధేయత చూపే అవకాశాలను వెదకండి, ముఖ్యంగా మీకు…