తెలుగు

ధ్యానం 303: నిశ్శబ్దం

మన ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అనేకమంది ఎదుర్కొనే ప్రమాదాల్లో నిరంతర శబ్దం ఒకటి.  రోజంతా మాటల మోత మనల్ని సులభంగా ముంచెత్తుతుంది.  అది రేడియో, టీవీ, ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, లేదా మరొకరి ఎడతెగని సంభాషణ ద్వారా కావచ్చు.  అరుదుగా మాత్రమే మనకు లభించేవి గాఢమైన…

ధ్యానం 279: మీ అంతరంగ నిశ్చయం

మీ ఆత్మలో కలిగే అంతరంగ నిశ్చయం ద్వారా దేవుడు మీతో మాట్లాడేది వినడానికి మీరు ప్రయత్నించాలి. కొన్ని సమయాల్లో దేవుని స్వరం బిగ్గరగా, స్పష్టంగా ఉన్నట్లు మీకు అనిపించవచ్చు; మరికొన్ని సమయాల్లో అది మెల్లగా, అయోమయం కలిగించేదిగా అనిపించవచ్చు. దేవుని స్వరం నుంచి మీ దృష్టిని మళ్లించగల విషయాలు ఎన్నో ఉన్నాయి…

ధ్యానం 184: యాజకుల పరిచర్యలోని కారుణ్యం

లేదు, యాజకులు పరిపూర్ణులు కారు.  వారు ప్రతిరోజూ పాపం చేస్తారు.  మిగిలిన మానవులందరిలాగే వారి దైనందిన జీవితాల్లోనూ నిరంతరం పశ్చాత్తాపం, హృదయపరివర్తన అవసరం.  అయినప్పటికీ వారు యాజకులు.  వారి పవిత్ర గురుపట్టాభిషేకం కారణంగా, ప్రభువు వారి ద్వారా స్పష్టంగా…

ధ్యానం 180: యేసు శ్రమలు

సువార్తలతో పరిచయమున్న మనలో కొన్నిసార్లు క్రీస్తు శ్రమల పట్ల ఒక రకమైన ఉదాసీనత కలగవచ్చు. ప్రతి సంవత్సరం ఆ వృత్తాంతం చదువుతుంటే మనం వింటాము; ఆయన శ్రమలను చూపించే ఎన్నో చిత్రాలను చూశాము. ఇలా సుపరిచితమైపోవడం వల్ల, అది మనపై తగిన ప్రభావం చూపేందుకు మనం అవకాశం ఇవ్వకపోవచ్చు…

ధ్యానం 177:  పవిత్ర విధేయత

దేవుని చిత్తానికి బదులుగా మన సొంత చిత్తాన్ని నెరవేర్చకుండా మనల్ని కాపాడే అత్యంత గొప్ప సాధనాల్లో పవిత్ర విధేయత ఒకటి.  సన్యాస జీవితంలో ఉన్నవారికి దీనిని అక్షరార్థంగానూ, బాహ్య ఆచరణలోనూ జీవించే అనుగ్రహం లభించింది. ఆ బాహ్య ఆచరణను అంతరంగంలో ఇముడ్చుకోవడం ద్వారా, తాము జీవిస్తున్నది…

ధ్యానం 157: నైతిక నిర్ణయాలు తీసుకోవడం

నైతికంగా సరైన నిర్ణయం తీసుకోవడానికి మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడుతున్నారా?  పతనమైన మన మానవ స్వభావం వల్ల ఇలా జరుగుతుంది.  జీవితంలో మనం సులభంగా అయోమయానికి లోనవుతాం; దేవుని మనస్సును, సంకల్పాన్ని గ్రహించడంలో సులభంగా విఫలమవుతాం.  మరి మీరు ఏమి చేయాలి?  మీ మనస్సాక్షి ఒక పవిత్ర స్థలమని తెలుసుకోండి; అక్కడికి…

ధ్యానం 149: అంతరంగ ప్రేరణలు

అవసరంలో ఉన్నవారితో దేవుని కారుణ్యాన్ని పంచుకోవడానికి మన చుట్టూ లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి.  కానీ ఆ అవకాశాలను చేజార్చుకోవడం చాలా తేలిక.  దైవకారుణ్య సాధనాలుగా మారడానికి మనల్ని మనం సమర్పించుకునే ప్రధాన మార్గాలలో ఒకటి, నిరంతరం శ్రద్ధగా గమనించడానికి ప్రయత్నించడం…

ధ్యానం 108: సభ స్వరం

ఎన్నో ఆంతరంగిక కృపలు, ప్రేరణలతో సహా అనేక విధాలుగా దేవుడు పునీతులతో మాట్లాడారు. అయితే పవిత్రతలో అత్యున్నత స్థాయిలో జీవించే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిపరుడైనా, చివరికి ఆయన సభ ద్వారా పలికే దేవుని స్వరానికి లోబడాలి. సభ, ముఖ్యంగా…

ధ్యానం 101: ఇతరుల ద్వారా మాట్లాడే దేవుడు

చాలా తరచుగా, మీరు వినవలసిన ఒక ప్రత్యేక సందేశాన్ని దేవుడు మీకు చెప్పాలని కోరుకుంటారు.  మీరు ప్రసంగం వింటున్నప్పుడు, పుస్తకం చదువుతున్నప్పుడు, రేడియోలో ఏదైనా వింటున్నప్పుడు లేదా స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, ఏదో ఒక ప్రత్యేకమైన విషయం మీ దృష్టిని బలంగా ఆకర్షించవచ్చు; అది ప్రభావం చూపుతున్నట్లు అనిపించకపోవచ్చు…

ధ్యానం 50: దేవుని స్వరాన్ని వినడం

రోజంతా దేవుడు మీతో మాట్లాడుతున్నాడన్నది నిజం.  ఆయన తన సత్యాన్ని, మీ జీవితానికి తన మార్గదర్శకత్వాన్ని నిరంతరం తెలియజేస్తూ, తన కారుణ్యాన్ని ఎల్లప్పుడూ ప్రసాదిస్తున్నాడు.  అయితే సమస్య ఏమిటంటే, ఆయన స్వరం ఎంతో మృదువుగా, నిశ్శబ్దంగా ఉంటుంది.  ఎందుకు?  ఎందుకంటే ఆయన మీ పూర్తి శ్రద్ధను కోరుతున్నాడు.  ఆయన…