తెలుగు

ధ్యానం 82: మమకారాలు

జీవితంలో మనం మమకారం పెంచుకోగల విషయాలు ఎన్నో ఉన్నాయి.  కొన్నిసార్లు మంచి విషయాలపై కూడా మమకారం పెంచుకోవచ్చు.  చాలా తరచుగా మనం అంటిపెట్టుకునేది మన సొంత మొండి సంకల్పాన్నే.  మనకు కావలసినది మనకు కావలసినప్పుడే కావాలని కోరుకుంటాం.  యథార్థమైన…

ధ్యానం 81: శక్తి మరియు కారుణ్యం

సర్వాధికారం కలిగి, ఎంతో కోపం, దురుద్దేశం, ప్రతీకార స్వభావం ఉన్న ఒక దేశ నియంతను ఊహించుకోండి.  అలాంటి వ్యక్తికి కోపం తెప్పించాలని మీరు కోరుకోరు.  ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా ఊహించుకోండి.  సర్వాధికారం కలిగి ఉండటంతోపాటు, నిర్మలమైన హృదయంతో ఆశీర్వదించబడిన వ్యక్తిని ఊహించుకోండి…

ధ్యానం 80: మన మరణ ఘడియలో

మీరు “నమో మరియా” ప్రార్థన చేసి ఉంటే, ఈ లోకంలో మీ చివరి ఘడియ కోసం ప్రార్థించినట్లే: “ఇప్పుడును మా మరణ ఘడియలోను మా కొరకు ప్రార్థించండి.”  మరణం అనేకమందిని భయపెడుతుంది; మన మరణ ఘడియ గురించి ఆలోచించడానికి మనం సాధారణంగా ఇష్టపడము.  కానీ…

ధ్యానం 79: మన ధన్య వ్యాకులమాత

మరియమాత తన జీవితంలో ఎన్నో కష్టాలను సహించింది.  తన రక్షకుణ్ణి అద్భుతరీతిగా గర్భం ధరించినప్పుడు ఆమె అనుమానాలను, అపహాస్యాన్ని సహించింది.  తన దివ్య కుమారుడు తిరస్కరణకు, అపార్థాలకు గురవుతుండగా ఆమె పరిపూర్ణమైన మాతృప్రేమతో చూస్తూ ఉంది.  ఆయన వేదనలోనూ మరణంలోనూ ఆయన చెంత నిలిచింది.  వీటన్నిటి మధ్య…

ధ్యానం 78: ఆనందం కోసం ఆకాంక్ష

మనలో అత్యంత మౌలికమైన కోరిక ఆనందం పొందాలన్నదే.  మనం చేసే ప్రతిదీ ఏదో ఒక విధంగా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి తోడ్పడాలనే ఉద్దేశంతోనే చేస్తాం.  పాపం కూడా మనల్ని ఆనందానికి నడిపిస్తుందనే తప్పుడు భావనతోనే చేస్తాం.  అయితే మానవ జీవిత సాఫల్యానికి ఒకే మూలం ఉంది, అలాగే ఒకే మూలం…

ధ్యానం 77: ప్రభువుకు సమస్తమూ తెలుసు

మన దివ్య ప్రభువుకు సమస్తమూ తెలుసన్నది నిశ్చయమైన సత్యం.  మన ప్రతి ఆలోచనా, మన ప్రతి అవసరమూ మనం ఎప్పటికైనా గ్రహించగలిగిన దానికన్నా ఎంతో ఎక్కువగా ఆయనకు తెలుసు.  కొన్నిసార్లు, ఆయన జ్ఞానం పరిపూర్ణమైనదని గ్రహించినప్పుడు, మనం మన అవసరాలను గుర్తించకపోయినా…

ధ్యానం 76: అన్యాయమైన నిందారోపణలు

బహుశా ప్రతి ఒక్కరూ ఇతరుల నుంచి అన్యాయమైన నిందారోపణను ఎదుర్కొని ఉంటారు. వాస్తవాల గురించి లేదా మనం చేసే పనుల వెనుక ఉన్న ఉద్దేశం గురించి అవతలివారు దురుద్దేశం లేకుండానే పొరబడటం వల్ల అలా జరిగి ఉండవచ్చు. లేదా, దాని వెనుక మరింత ద్వేషం, క్రూరత్వం ఉండవచ్చు. తప్పుడు నిందారోపణలకు గురికావడం ఎంతో బాధాకరంగా ఉండవచ్చు, అంతేకాక…

ధ్యానం 75: ఇతరులలో క్రీస్తును కలుసుకోవడం

దివ్యసత్ప్రసాదం నిజంగా పవిత్రమైనది.  దానిని ఆరాధిస్తూ, అత్యంత గౌరవంతో చూసుకుంటాము.  మన ప్రభువును మనం ఎన్నడూ విసిరివేయము; నేలమీద గానీ, మరేదైనా అగౌరవకరమైన స్థలంలో గానీ పారవేయము.  అయినప్పటికీ, యేసుపట్ల మనం చూపే గౌరవాన్నే ఇతరులపట్ల చూపడంలో తరచూ విఫలమవుతాము…

ధ్యానం 74: కరుణగల హృదయం

“సానుభూతి”కి, “కరుణ”కి మధ్య తేడా ఉందా?  ఉంటే, ఆ తేడా ఏమిటి?  మరి ఈ రెండింటిలో ఏది మరింత కోరదగినది?  సానుభూతి అంటే కేవలం మరొకరి పరిస్థితిని చూసి మనం బాధపడటం.  ఒక విధంగా చెప్పాలంటే, వారిపై జాలిపడటం.  కానీ కరుణ దీనికంటే ఎంతో ముందుకు వెళుతుంది.  అంటే మనం…

ధ్యానం 73: యేసు పట్ల మన ఆకాంక్షలో ఎదగడం

మనం యేసును ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అంత ఎక్కువగా ఆయనను కోరుకుంటాము. అలాగే, మనం ఆయనను ఎంత ఎక్కువగా కోరుకుంటామో, అంత ఎక్కువగా ఆయనను తెలుసుకుంటాము. తెలుసుకోవడం, కోరుకోవడం, కోరుకోవడం, తెలుసుకోవడం—ఇలా ఒకదానిని మరొకటి పెంపొందించే అందమైన అనుభవం ఇది (డైరీ #273 చూడండి)…