తెలుగు

ధ్యానం 180: యేసు శ్రమలు

సువార్తలతో పరిచయమున్న మనలో కొన్నిసార్లు క్రీస్తు శ్రమల పట్ల ఒక రకమైన ఉదాసీనత కలగవచ్చు. ప్రతి సంవత్సరం ఆ వృత్తాంతం చదువుతుంటే మనం వింటాము; ఆయన శ్రమలను చూపించే ఎన్నో చిత్రాలను చూశాము. ఇలా సుపరిచితమైపోవడం వల్ల, అది మనపై తగిన ప్రభావం చూపేందుకు మనం అవకాశం ఇవ్వకపోవచ్చు…

ధ్యానం 152: బాధలలోని కృపా రహస్యం

మానవ బాధ జీవితం లోని అత్యంత గొప్ప రహస్యాలలో ఒకటి.  పునీత ఫౌస్టీనా దినచర్య, అలాగే మన విశ్వాసానికి చెందిన ఆధ్యాత్మిక సంప్రదాయమంతా, బాధకు సంబంధించిన ఈ గాఢమైన రహస్యం గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తాయి.  ముందుగా, పూర్తిగా లౌకిక దృష్టితో చూస్తే, బాధ ఏమాత్రం కోరదగినది కాదు.  నిజానికి, సాధారణంగా దానిని ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తారు; దానిని అత్యంత ఘోరమైన విషాదంగా భావిస్తారు.  అయితే, క్రైస్తవ దృక్కోణంలో, బాధ స్వయంగా…

ధ్యానం 137: సిలువలోని శక్తి

మీరు ప్రార్థించేటప్పుడు, ఎప్పుడైనా కూర్చొని సిలువపై యేసు స్వరూపాన్ని తదేకంగా చూస్తారా? బయటి దృష్టితో చూస్తే, సిలువపై యేసు స్వరూపం అర్థంకాని ఒక వాస్తవం. అంత భయానకమైన సంఘటనను మనం ఎందుకు ఉన్నతంగా ఎత్తిచూపి గౌరవిస్తాం? దేవుని కుమారుని క్రూరమైన హత్య మొదట్లో మనలను ఆకర్షించే విషయం కాకపోవచ్చు. అయినా…

ధ్యానం 99: పాపమనే కొరడా

యేసు అంతగా ఎందుకు బాధపడ్డారు?  ఆయన అంత తీవ్రమైన కొరడా దెబ్బలను ఎందుకు భరించారు?  ఆయన మరణం అంత బాధాకరంగా ఎందుకు ఉండింది?  ఎందుకంటే పాపానికి పర్యవసానాలు ఉంటాయి; అది తీవ్రమైన బాధకు మూలం.  అయితే యేసు స్వచ్ఛందంగా, ఏ పాపమూ లేకుండా బాధలను స్వీకరించడం ద్వారా రూపాంతరం చెందింది…

ధ్యానం 81: శక్తి మరియు కారుణ్యం

సర్వాధికారం కలిగి, ఎంతో కోపం, దురుద్దేశం, ప్రతీకార స్వభావం ఉన్న ఒక దేశ నియంతను ఊహించుకోండి.  అలాంటి వ్యక్తికి కోపం తెప్పించాలని మీరు కోరుకోరు.  ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా ఊహించుకోండి.  సర్వాధికారం కలిగి ఉండటంతోపాటు, నిర్మలమైన హృదయంతో ఆశీర్వదించబడిన వ్యక్తిని ఊహించుకోండి…

ధ్యానం 76: అన్యాయమైన నిందారోపణలు

బహుశా ప్రతి ఒక్కరూ ఇతరుల నుంచి అన్యాయమైన నిందారోపణను ఎదుర్కొని ఉంటారు. వాస్తవాల గురించి లేదా మనం చేసే పనుల వెనుక ఉన్న ఉద్దేశం గురించి అవతలివారు దురుద్దేశం లేకుండానే పొరబడటం వల్ల అలా జరిగి ఉండవచ్చు. లేదా, దాని వెనుక మరింత ద్వేషం, క్రూరత్వం ఉండవచ్చు. తప్పుడు నిందారోపణలకు గురికావడం ఎంతో బాధాకరంగా ఉండవచ్చు, అంతేకాక…

ధ్యానం 59: “ఓ రక్తమా, జలమా…”

యేసు మరణించిన తరువాత, సైనికులలో ఒకడు ఆయన దగ్గరకు వచ్చాడు; ఆయన మరణించాడని నిర్ధారించుకోమని అతనికి ఆజ్ఞ ఇవ్వబడింది.  అందువల్ల ఆ సైనికుడు ఆయన అమూల్య దేహాన్ని బల్లెంతో పొడిచాడు; వెంటనే గాయపడిన ఆయన హృదయం నుండి రక్తం, నీరు ఉప్పొంగి ప్రవహించాయి.  యుగయుగాలుగా ఈ సంఘటనను ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తూ వచ్చారు…

ధ్యానం 26: మీ అంతరంగ సిలువను క్రీస్తుతో ఐక్యం చేయడం

మీరు దేవునికి మరింత దగ్గరవుతున్న కొద్దీ, కొన్నిసార్లు మీలో ఎన్నో భావాలు కలుగుతాయి.  కొందరికి దేవుడు తమను తిరస్కరించాడనే భావన కలుగుతుంది.  దేవుడు మనలను ఎన్నడూ తిరస్కరించడు; అయినా తిరస్కరణకు గురయ్యామనే అంతరంగ భావనలు నిజంగానే కలగవచ్చు.  ఇది కొందరిని నిరాశలోకి నెడుతుంది.  ఇప్పుడు గానీ భవిష్యత్తులో గానీ మీరు…

featured image DM

ధ్యానం 9: 3 గంటల వేళ ఆయన పాడుశ్రమలను ధ్యానించడం

పునీత ఫౌస్తీనా దినచర్య మనలను వివిధ మార్గాల్లో ఒక నూతన భక్తి విధానానికి ఆహ్వానిస్తుంది.  ప్రతిరోజూ యేసు మరణించిన వేళను గౌరవించడం నాలుగవ మార్గం…

featured image DM

ధ్యానం 5: లోక విమోచనం

మానవావతారం అప్పటివరకు తెలిసినవాటన్నిటిలోకీ అత్యంత గొప్ప కారుణ్య కార్యం. ఆ తరువాత దానిని మించిన ఏకైక కార్యం, యేసు సిలువపై మరణించి తన రక్తంతో పాపాన్ని, మరణాన్ని నాశనం చేయడమే. సిలువ రక్తం ద్వారా జరిగిన లోక విమోచనం ప్రేమ, కారుణ్య కార్యం…