తెలుగు

ధ్యానం 40: మన ప్రభువు హృదయంలోకి ప్రవేశించడం

చాలా సందర్భాల్లో ఒక ధూళికణమో, ఒక ఇసుక రేణువో అంతగా ప్రాముఖ్యత లేనిదిగా ఉంటుంది. ఇంటి ఆవరణలోగానీ, ఇంటి నేలపైనగానీ ఉన్న ఒక్క ధూళికణాన్ని లేదా ఇసుక రేణువును ఎవరూ గమనించరు. కానీ వీటిలో ఏదైనా కంటిలో పడితే, ఆ రేణువు లేదా ధూళికణం ఉన్నట్లు వెంటనే తెలుస్తుంది. ఎందుకు? ఎందుకంటే…

ధ్యానం 33: శుద్ధీకరణలోని కారుణ్యం

దేవుడు మీ ఆత్మను చూసే విధంగా మీరు కూడా చూడగలిగితే ఎలా ఉంటుందో ఊహించండి.  మీకు ఏమి కనిపిస్తుంది?  దేవుడు మీ ఆత్మను ఎలా చూస్తుండవచ్చు?  నిశ్చయంగా, ఆయన మీలో తన ప్రియమైన బిడ్డను చూస్తాడు; అత్యంత ప్రేమతో మిమ్మల్ని చూస్తాడు.  అయితే ఆయన మీ పాపాన్ని కూడా చూస్తాడు, అతి స్వల్పమైన పాపాన్ని సైతం.  ఈ పాపాలు, అతి చిన్న లోపం కూడా…

ధ్యానం 32: క్షమాపణలోని కారుణ్యం

జీవితమంతటా ఇతరుల పాపాల వల్ల మీరు గాయపడతారు. ఇది తప్పనిసరి. ఈ గాయాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారన్నదే నిజంగా ఆలోచించవలసిన ప్రశ్న. మీరు దానిని పట్టుకొని, పదేపదే తలచుకుంటూ కుమిలిపోతారా? లేక క్షమిస్తారా? అయితే క్షమించడం మాత్రమే సరిపోదు. దైవకారుణ్యం మీ ఆత్మలోకి ఎంతగా ప్రవేశించనివ్వాలంటే…

ధ్యానం 342: శ్రమానుభవం అందించే సేదదీర్పు

సాధారణంగా మనం “శ్రమానుభవం”, “సేదదీర్పు” అనే పదాలను కలిపి వాడము. క్రీస్తు శ్రమానుభవం సేదదీర్పును ఎలా ఇవ్వగలదు? భూలోక దృష్టితో చూస్తే అది కేవలం భయానకమైనదిగా, దుఃఖకరమైనదిగా మాత్రమే కనిపిస్తుంది. ప్రభువు ఎంతో బాధపడ్డారు; మన ధన్యమాత కూడా ఆయనతోపాటు అత్యంత దుఃఖభరితమైన…

ధ్యానం 338: రహస్యాన్ని కాపాడటం

ఇతరులు మనతో పంచుకున్న విషయాలను గోప్యంగా ఉంచడం, మనం వారికి అందించగల ఒక ప్రేమకార్యం. ఎవరైనా ఒక సమస్యతోనో, అయోమయంతోనో మన వద్దకు వచ్చి, ఆ విషయాన్ని మనలోనే ఉంచమని అడిగిన అనుభవాలు మనందరికీ ఉన్నాయి. ఈ విధమైన పవిత్ర రహస్యాన్ని మీరు కాపాడగలరా? గోప్యతను కాపాడటం ఇతరుల పట్ల చూపే అద్భుతమైన కారుణ్యకార్యం. ఒకవేళ…

ధ్యానం 337: ఇతరుల ఆందోళనను తగ్గించడంలో సహాయం

మన జీవితంలో అప్పుడప్పుడు కలవరపడుతున్న, మనస్తాపంతో ఉన్న లేదా చింతిస్తున్న వ్యక్తులు మనకు ఎదురవడం దాదాపు ఖాయం. వారు ఏదో ఒక విషయం గురించే అతిగా ఆలోచిస్తూ ఉండవచ్చు; వారి ఆలోచన కొంతవరకు హేతువిరుద్ధంగా కూడా ఉండవచ్చు. కారుణ్యం చూపడానికి ఇది ఎంత కృపాపూరితమైన అవకాశం! ఆందోళన…

ధ్యానం 335: నిరంతరం క్షమించడం 

మిమ్మల్ని హింసించేవారి కోసం ప్రార్థించడం, వారితో అత్యంత గౌరవంతోను కనికరంతోను వ్యవహరించడం జీవితంలో అత్యంత కష్టమైన పనులలో ఒకటి. అయితే వారిని ద్వేషించడం వల్ల గానీ, వారిపై విరుచుకుపడటం వల్ల గానీ ప్రయోజనం ఏమిటి? వారికి ఈ విధంగా “హాని” చేయడం వల్ల వారి ఆత్మకన్నా మీ ఆత్మకే ఎంతో ఎక్కువ నష్టం కలుగుతుంది. క్షమించండి…

ధ్యానం 334: ఆత్మలకు సేవచేయడం

ఇతరులకు సేవచేయగల సామర్థ్యం మనకు లభించిన అత్యంత గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి. మనం వారికి అనేక విధాలుగా, ముఖ్యంగా మన ప్రత్యేక పిలుపునకు అనుగుణంగా సేవచేస్తాము. అయితే ఒక వ్యక్తికి మనం చేయగల అత్యంత గొప్ప సేవ ఏమిటంటే, దేవుని కరుణకు సేవకులమై, వారిని పరలోక మహిమల వైపు నడిపించడం…